Wednesday, 10 September 2025

 @ నాన్న నచ్చడెందుకో...?@52
          తేది: 10/09/2025
""""""""""""""""""""""""""""""""""""""""""

నాన్నంటే నడిపించే మార్గం నిలబెట్టే ధైర్యం మనం
పారాడుతాం, తడబడతాం, నడుస్తాం, పరిగెడతాం, పడతాం,
లేస్తాం, నిలబడతాం, ఎదుగుతాం ప్రతి మలుపు గెలుపులో
నాన్నదే కష్టం మన మంచీచెడూ కష్టం,నష్టం, బాధ, ఆనందం
అన్నీ నాన్నవే మన విజయానికి మనసులోనే మౌనంగా
కేరింతలు కొడతాడు మనమేం చేయాలో,
ఏం చదవాలో, ఎలా
నడవాలో మనకన్నా ముందే ఆలోచిస్తాడు మనం వేసే ప్రతి
అడుగు కిందా నాన్న చేయి ఉంటుంది కాబట్టి ధైర్యంగా
అడుగెయ్యొచ్చు తప్పులు చేస్తే కాస్తాడు, తప్పటడుగులు వేస్తే
చేయందిస్తాడు ఇంతా చేస్తే చాలామందికి నాన్న నచ్చడెందుకో..?
ఇదిలా చేయి, అదలా చేయకు, అది తిను, ఇది కట్టుకో
అంటూ నాన్న నిత్యం గదమాయిస్తుంటాడన్నది కొందరి ఫిర్యాదు
నిజానికి ఇంతకుమించిన లైఫ్ కోచ్ ఎవరుంటారు? అర్థం
చేసుకోని వారికి నాన్నది చాదస్తంగానే కనపడుతుంది ఏంతినాలో, ఎలా ఉండాలో తెలియదా..? ఎక్కడికి వెళ్లాలో, ఎప్పుడు
రావాలో అన్నీ చెప్పాలా? నాన్న పెద్ద తలనొప్పి అంటూ
గొణుక్కుంటూ ఉంటారు ఎవరెంత విసుక్కున్నా, నాన్నేమీ
పట్టించుకోడు అమ్మకు పిల్లలు బాగుంటే చాలు నాన్నకు
అలాకాదు...తన బిడ్డలు నలుగురిలో తలెత్తుకుని నడవాలి
తనకన్నా బాగా బతకాలి పైపైకి ఎదగాలి అయినవారికి అండనివ్వాలి పొరుగువారికి తోడుండాలి అనుకుంటాడు
నాన్న ప్రమాణాల లెవలే వేరు అవన్నీ మన బాగుకోసమే..!
అయినా నాన్న నచ్చడెందుకో నాన్న వేలుపట్టి నడిపిస్తాడు ఆ దారిలో ప్రపంచం మొత్తం
పరిచయమవుతుంది
గుర్తుందా చిన్నప్పుడు గుడికెళ్లినప్పుడు, ఊరేగింపుల్లో దేవుణ్ని
చూపించడానికి భుజంపైకి ఎత్తుకుని చూపించేవాడు స్వయంగా
దేవుడి మీదే కూర్చుని దేవుణ్ని చూస్తున్నామన్న సంగతి అప్పుడు
తెలియకపోవచ్చు అదిప్పటికీ
అర్థంకాకపోతే అంతకన్నా
దురదృష్టవంతులు ఎవరూ ఉండరు
మీరు ఎంత ఎదిగినా కష్టమొస్తే నాన్నను తలచుకోండి
ఎక్కడున్నా ధైర్యం చెబుతాడు చదువుల్లో వెనకపడినా,
కుటుంబంలో భేదాలొచ్చినా, డబ్బులు దొరక్కపోయినా,అప్పులు
ముంచెత్తినా, ఆస్తులు పంచాయితీ పెట్టినా... అండగా
నాన్నొక్కడుంటే చాలు కష్టాల కొండలన్నీ కరిగిపోతాయంతే
రీరిలీజ్ సినిమాల కటౌట్లకూ పాలాభిషేకాలు చేసేంత
మూర్ఖత్వంలో పడి కొట్టుకోవడమెందుకు...?
తెరపై మాత్రమే
వెలిగే తారల వెంట పరుగులెందుకు జీవితనౌకకు
దారిచూపించే లైట్ హౌస్ అంతెత్తున నాన్న నట్టింట్లో
తిరుగుతుంటే నాన్నే ఒక హీరో ఎందుకంటే, మనకోసం
ఏదైనా చేస్తాడు...
ఎన్ని ఎత్తులైనా ఎక్కుతాడు...
ఎంత కిందికైనా దిగొస్తాడు...
ఏదడిగినా చేసి పెడతాడు...
సరిగ్గా
చూడండి, అన్నీ ఒక్కచోటే దొరికే పవర్ హౌస్ నాన్న ఆయన
అడుగులను అనుసరిస్తే చదువు, ఉద్యోగం, కెరీర్.. ఇంతేనా!
ప్రపంచాన్నే గెలవచ్చు నమ్మండి,
నాన్నకు మించిన
స్ఫూర్తిపాఠం ఎక్కడా దొరకదు..!

No comments:

Post a Comment