*ఇద్దరూ ఇద్దరే.!!*
*మనప్రవచనకారులు చాగంటి, గరికపాటి, ఇద్దరి వైవిధ్యాన్నీ కె.వి.యస్.సన్యాసిరావుగారు వింగడించిన తీరు అద్భుతం!*
*చదవండి మీకే తెలుస్తుంది.*
*👆ప్రవచనమే ద్విపాత్రాభినయమైతే.!ఒకరేమో పువ్వులపై నడిపిస్తూ... మరొకరేమో నవ్వులతో తడిపేస్తూ...*
*ఒకరేమో విషయాన్ని ముక్కుసూటిగా... మరొకరేమో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే...*
*ఒకరేమో అలౌకిక ప్రపంచ విహారం... మరొకరేమో లౌకికప్రపంచ సంచారం...*
*ఒకరేమో నేరుగా విశ్వేశ్వరుని సన్నిధికి... మరొకరేమో విశ్వం మొత్తం తిప్పి అలా అదే సన్నిధికి...*
*ఒకరేమో విచ్చుకునే అంతరంగం... మరొకరేమో టింగురంగం...*
*ఒకరేమో పంచె... లాల్చీ... కండువా... మరొకరేమో అదే పంచె... ఆపై కోటు...*
*ఒకరేమో నిరాడంబరం... మరొకరేమో గండపెండేరం...*
*ఇద్దరి కతా ఆధ్యాత్మికతే... ఒకే లక్ష్యం... ఒకటే గమ్యం... విషయం అదే... చెప్పే తీరు వేరు...*
*చాగంటి గుడిగంట... గరికపాటి ఆ గుడిలో హోమం మంట...*
*రామాయణమైనా... భారతమైనా... భాగవతమైనా... శివపురాణమైనా... కార్తీక పురాణమైనా...*
*చాగంటి చెబితే తన్మయం... గరికపాటి పలికితే విస్మయం...*
*ఒకరు వివరిస్తే ఇదే ప్రపంచమని అనిపిస్తుంది... మరొకరు సవరిస్తే ఇదా ప్రపంచమని అనిపిస్తుంది... ఇద్దరూ ప్రవచనకర్తలే...*
*ఒకరేమో పరవశకర్త... మరొకరేమో తన వశకర్త.! ఇద్దరూ మహా పండితులే...*
*పూజ్యులు... మాన్యులు... మించి ధన్యులు.! ఇద్దరి ధారణ అసాధారణం...*
*మాటల మూటలు... విషయ పరిజ్ఞానం సాగర పర్యంతం... ధాటి అనంతం... మాటాడుతుంటే గుడిగంటల సవ్వడి వోలె గంటలు గంటలు... వినాల్సిందే ఆసాంతం.!*
*ఒకరేమో భగవంతునికి నిన్నటి ప్రపంచపు ఉత్తరం... మరొకరేమో నేటి లోకపు ప్రత్యుత్తరం...*
*ఇద్దరి కీర్తీ లోకోత్తరం.! ఇద్దరిదీ ప్రియవచనం... ఇద్దరూ ప్రవచనానికి బహువచనం.! రెండు మేరునగాలను ఒక దరి చేర్చి ఎంచి... పోల్చి చూపే ప్రయత్నం చేశాను... 🙏🙏*
{సేకరణ:- అడ్మిన్ MGN}
*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌺🙇🏻♂️🌺 🙏🕉️🙏 🌺🙇🏻♂️🌺
No comments:
Post a Comment