[7/19, 12:09] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
విద్య వలనను వినయంబు, వినయమునను
బడయు పాత్రత, పాత్రత వలన ధనము,
ధనము వలనను ధర్మంబు, దాని వలన
ఐహికాముష్మిక సుఖంబు లందు నరుడు
*భావం :-*
మానవుడు విద్యవల్ల వినయాన్ని
పొందుతాడు. వినయం వల్ల అర్హత వస్తుంది. అర్హత
ధనాన్ని చేకూరుస్తుంది. ఆ ధనం ఉంటే ధర్మం
చేయవచ్చు. ధర్మ గుణం వల్ల ఈ లోకంలోనూ,
తరువాత పరలోకంలోనూ సుఖాలు పొందుతాడు.
*--భర్తృహరి సుభాషితం*
[7/19, 12:09] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*వద్దు*
వద్దూ వద్దూ నాకొద్దూ
పుచ్చులు పెంచే చాక్లెట్లొద్దు
వద్దూ వద్దూ నాకొద్దూ
పురుగుల మందుల కూల్డ్రింళ్లొద్దు
వద్దూ వద్దూ నాకొద్దూ
ఈగలు వాలిన పండ్లూ వద్దు
వద్దూ వద్దూ నాకొద్దూ
కండ్లూ పోయే టీవీలొద్దు
వద్దూ వద్దూ నాకొద్దూ
ముద్దు పెట్టని అమ్మా వద్దు.
*డా.ఎం.హరి కిషన్ - 9441032212*
[7/19, 12:09] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అడుసు తొక్కనేల కాలు కడగనేల*
అడుసు అంటే బురద (బాడి). బురదను ముట్టుకుంటే అంటుకుంటుంది. ఈ విషయం తెలిసీ దాన్ని తొక్కటం ఎందుకు, తర్వాత అంటుకుంది అని బాధపడి కడుక్కోవటం ఎందుకు అని పూర్తి అర్ధం. అంటే, తెలిసి తప్పు చేయటం ఎందుకు తర్వాత బాధపడటం ఎందుకు అనే అర్ధం కోసం వాడతారు.
[7/19, 12:09] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే, ఆస్తులు అమ్మినా ఆరోగ్యం రాదు.*
[7/19, 12:09] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*కట్ట కట్టుకొని వచ్చారేందిరా*
అందరు ఒక్కసారె రావడం. ఏదైనా ఒక చిన్న విషయాన్ని చర్చించడానికి చాల మంది వస్తే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
[7/19, 12:09] +91 79819 72004: *✍నేటి కథ ✍🏽*
*ప్రాణాలు తీసిన దొంగతనం*
కోటయ్యకు చిల్లర దొంగతనాలు చేయడం అలవాటు. తన దొంగతనాలకు బాగా ఉపయోగపడుతుందని తోచి, ఓ కోతిని తీసుకు వచ్చాడు. తన దొంగ విద్యలన్నిటినీ ఆ కోతికి బాగా నేర్పాడు. ఆ కోతి అలికిడి కాకుండా దొడ్డి గోడలు ఎక్కి, లోపల వున్న విలువైన వస్తువులను తీసుకువచ్చి ఇస్తూవుండేది. ఆ వస్తువులను అమ్మి కోటయ్య సొమ్ము చేసుకొంటూ వుండేవాడు.
ఇలా ఉండగా ఊరిలోని దేవాలయంలో వున్న కొబ్బరి చెట్ల మీద కోటయ్య కన్ను పడింది. ఆ కొబ్బరి చెట్లు చాలా పొడుగైనవి. ఆకాశంలో మబ్బులను అందుకొనేటంత ఎత్తయిన ఆ చెట్ల కాయలను కోయడానికి ఎవరికీ ధైర్యం చాలదు. అందుచేత ఎవ్వరూ ఆ చెట్లను ఎక్కరు. కోసే వారు లేకపోవడంవల్ల, గుత్తులు గుత్తులుగా కాయలతో కొబ్బరి గెలలు వేలాడుతూ వుంటాయి.
కోటయ్య కొబ్బరిచెట్టు దగ్గరకు కోతిని తీసుకువచ్చి సంజ్ఞ చేశాడు. చర చరా చెట్టు ఎక్కి మొవ్వులో కూర్చుని, కోతి ఒక్కొక్క కాయనే తుంచి కింద పడవేయడం మొదలు పెట్టింది. కిందపడిన కాయలను ఆదరాబాదరా ఏరుకొంటూ, పోగుచేస్తూ, కోటయ్య, తల పైకెత్తి చూడటం మరిచి పోయాడు. అంతలో రెండు కొబ్బరి కాయలు అతని నడి నెత్తి మీద పడ్డాయి. ఎంతో ఎత్తు నుండి పడినందువల్ల, ఆ దెబ్బకు తల పగిలి రక్తం కక్కుకొంటూ, గిలగిల తన్నుకొని, కోటయ్య కన్ను మూశాడు!
కొబ్బరికాయలు పడుతున్న చప్పుడు విని పూజారి గబగబా వచ్చాడు. కొబ్బరి చెట్టు కింద కోటయ్యను, పైన కోతి చూసి ఆశ్చర్యపోయాడు!"తాను దొంగతనాలు చేయడమే గాక, కోతికి కూడా ఆ విద్య నేర్పాడు దురలవాటు నేర్వడం, నేర్పటం సుళువే కాని, ఒక్కొక్కప్పుడు ఆ దురలవాటు ప్రాణాలు తీస్తుంది కదా" అనుకొంటూ నిలబడి పోయాడు ఆ పూజారి నిశ్చేష్టుడై...!
*సేకరణ : 🅢🅞🅝🅣🅔🅛🅐. 🅓🅗🅐🅝🅤🅝🅨🅐*
[7/19, 12:09] +91 79819 72004: *✅ తెలుసుకుందాం ✅*
*🛑పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి ?*
ఆకాశంలో పక్షి గుంపులు V ఆకారంలో వెళ్లడంపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ముఖ్యమైన విషయాలు తెరపైకి వచ్చాయి. పక్షులు ఎందుకు అలా ఎగురుతాయో ప్రపంచానికి వెల్లడించారు. పక్షులు ఎగురుతున్నప్పుడు V ఆకారంలో ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి కారణం... ఈ ఆకారంలో పక్షులు సులభంగా ఎగరగలవు. ఇతర సహచర పక్షులతో అవి ఢీకొట్టవు. రెండవది.. పక్షుల గుంపులో అందరికీ మార్గనిర్దేశం చేసే నాయకుడు ఉంటాడు. ఎగురుతున్నప్పుడు ఆ నాయకుడు ముందుంటాడు. దాని వెనుకాలే ఇతర పక్షులు ఎగురుతాయి. ఆ కారణంగానే పక్షులు ఎగురుతున్నప్పుడు V ఆకారంలో పయనిస్తాయట. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
లండన్ లోని రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ అషర్ వుడ్ ఉద్దేశం ప్రకారం.. ఇలా V ఆకారంలో పయనించడం వల్ల గాలి వేగాన్ని నియంత్రిగలుగుతాయట. ఇలా ఎగరడం వల్ల వాటి శక్తిని ఆదా చేసుకుంటాయట. పుట్టుకతోనే పక్షులకు ఇలా ఎగిరే కళ లేదని పరిశోధకులు చెబుతున్నారు. కాలక్రమేణా ఇతర పక్షులతో కలిసి నివసిస్తున్న క్రమంలో అవి నేర్చుకుంటాయని చెబుతున్నారు. V ఆకారంలో పక్షలు ఎగరాడానికి వాటిలో ఉండే పోటీతత్త్వమే కారణమన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. పక్షుల మధ్య పోటీ లేదని తేల్చి చెప్పారు.
పక్షులు సమానత్వాన్ని ప్రపదర్శిస్తాయట. అయితే, ఏదైనా పక్షి ముందుగా ఎగిరితే.. దానిని మిగతా పక్షులు ఫాలో అవుతాయట. ముందున్న పక్షి అలసిపోయినప్పుడు దాని స్థానంలో మరొక పక్షి ముందుకు కదులుతుందట. ముఖ్యంగా వలస పక్షులు V ఆకారంలో పయనిస్తాయట. అవి పొడవుగా వీ-షేప్‌లో ఎగురటం వలన అన్ని పక్షులకు నాయకుడిగా అవకాశం దక్కుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా, పూర్తిగా ఆరోగ్యకరమైన పక్షులు మాత్రమే ప్రధాన స్థానంలో ముందుకు సాగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
[7/19, 12:09] +91 79819 72004: Hari Kishan:
రాకాసి జంతువులు (సంయుక్త అక్షరాలు లేని కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****
రవి అదిరిపడి లేచి కళ్ళు తెరిచాడు. పడుకున్న మంచం అటూ ఇటూ ఉయ్యాలలాగా ఊగిపోతోంది. బయటనుంచి పెద్దగా అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఇంటిలోంచి కంగారుగా బయటకు వచ్చి చుట్టూ చూశాడు. జనాలంతా తలా ఒక వైపుకు పారిపోతున్నారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదు. అందరి మొహాల్లోనూ ఏదో భయం. నగరమంతా గందరగోళంగా అల్లకల్లోలంగా వుంది.
ఏమైంది.. ఎందుకలా పారిపోతున్నారు అని ఒకతన్ని గట్టిగా పట్టుకొని అడిగాడు.
అతను ఆయాసపడతా ఏందీ... నీకింకా ఏమీ తెలీదా... పిచ్చోని లెక్క ఉన్నావే. మన నగరం మీదికి వింత జంతువులు దాడి చేశాయి. దొరికిన వారిని దొరికినట్టు చంపుతా ఉన్నాయి. వాటి చేతికి చిక్కితే అంతే. పద పద తొందరగా పారిపోయి ఎక్కడన్నా దాక్కో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
రవికి అంతా గందరగోళంగా ఉంది. దూరంగా పెద్ద పెద్ద ఆకారాలు కనపడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద కొండంత ఉన్నాయి. కొన్ని చీమ తల కాయలతో... మరికొన్ని పక్షుల తలలతో... ఇంకొన్ని జంతువుల తలలతో... భయంకరంగా ఉన్నాయి.
వాటి అడుగుల కింద పడి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అవుతున్నాయి. మనుషులు నుజ్జు నుజ్జు అవుతున్నారు. రవి అది చూసి వణికిపోయాడు. ఇంకా అక్కడే నిలబడి వుంటే తనకు గూడా అదే గతి పడుతుంది అనుకోని వెనక్కి తిరిగి వురక సాగాడు. అవి భయంకరంగా కేకలు పెడుతా, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటా విమానాల్లా వేగంగా దూసుకు రాసాగాయి.
రవి అలా కొంత దూరం పారిపోయాడో లేదో ఒక పెద్ద చీమ తల వున్న రాకాసి వానికి అడ్డం వచ్చింది. రవి దాన్ని చూసి వణికిపోతా పారిపోవడానికి వెనక్కి తిరిగాడు. అంతలో రాకాసి చీమ చటుక్కున రవి జుట్టు పట్టుకొని పైకి లేపింది. ఏరా నా నుంచే తప్పించుకొని పారిపోదాం అనుకుంటా ఉన్నావా ... వుండు నీ పని చెబుతా అంటూ రవి కాలు పట్టుకొని చటుక్కుమని విరిచేసింది. అంతే రవి ఆ దెబ్బకు బాధతో గట్టిగా అరిచాడు. నొప్పితో విలవిలాడసాగాడు.
వద్దు... వద్దు... నన్నేమీ చెయ్యొద్దు. నేను చిన్న పిల్లవాన్ని. చానా మంచివాన్ని. ఎవరికీ ఎప్పుడూ ఎటువంటి ఆపదా తలపెట్టలేదు. నన్నొదులు నీకు దండం పెడతా అంటూ కళ్లనీళ్లతో వేడుకుంటా గింజుకోసాగాడు.
అలాగా... నువ్వు అమాయకునివా... ఎవరికీ ఏ ఆపదా తన పెట్టలేదా. ఆహా ఏం అబద్ధాలు ఆడుతా వున్నావురా... మా జాతికి చెందిన చిన్న చిన్న చీమలు ఎక్కడ కనపడినా ఊరికే వాటిని తొక్కి తొక్కి చంపుతా వుంటావు. నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా. వాటికి ఎవరూ లేరనే కదా... ఇప్పుడు చూడు నీవు వాటినెలా చంపుతావో అలాగే నిన్ను కూడా కాలికింద వేసి నలిపి చంపుతా... ఎవడు అడ్డం పడతాడో చూద్దాం అంటూ కిందపడేసి కాలు పైకెత్తింది.
వద్దొద్దు. ఇంకెప్పుడూ చిన్న చీమలను చంపను. నన్నేమీ చెయ్యొద్దు అంటూ గట్టిగా అరిచాడు రవి.
కానీ ఆ రాకాసి చీమ రవి మాటలను కొంచెం కూడా పట్టించుకోలేదు.
కాలు అలాగే రవి మీద పెట్టి గట్టిగా నొక్కసాగింది. రవికి ఎముకలన్నీ ఎక్కడివక్కడ ఫటఫటమని విరిగి పోసాగాయి. నొప్పితో విలవిలలాడిపోతా కాపాడండి... కాపాడండి... నన్ను ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరవసాగాడు.
అప్పుడే రవి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది.
బాధతో కేకలు పెడతా వున్న రవిని చూసింది.
వెంటనే ఉరుక్కుంటా దగ్గరికి వచ్చి రేయ్ రవీ.. లెయ్ లెయ్... నిదురలో ఏమలా కేకలు పెడతా వున్నావు. ఏమైంది. అనింది గట్టిగా కుదుపుతా.
రవి అదిరిపడి నిదుర లేచాడు.
చుట్టూ చూశాడు. ఎదురుగా అమ్మ.
భయంకరమైన జంతువులు ఏవీ లేవు.
తను తన మంచం మీదనే ఉన్నాడు. ఒళ్లంతా భయంతో చమట పట్టి తడిసిపోయింది.
అమ్మో... ఎంత భయంకరమైన కల అనుకున్నాడు.
ఏమైందిరా అడిగింది అమ్మ.
రవి తనకు వచ్చిన కలంతా వివరించాడు.
రవి వాళ్ళ అమ్మ కాసేపు ఆలోచించి మన కలలో అప్పుడప్పుడూ మనం చేసే వెధవ పనులే కనపడుతుంటాయి. నిజం చెప్పు... నువ్వు జంతువులను, పక్షులను ఏమైనా బాధ పెడతా వున్నావా అనడిగింది.
అప్పుడే అక్కడికి రవి చెల్లెలు రమ వచ్చింది.
అమ్మా... నువ్వు చెప్పింది నిజమే. అన్నయ్య బడికి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు దారిలో చీమల పుట్టలు కనపడితే చాలు ఎగిరి వాటిమీద దూకుతాడు. ఏదైనా చెట్టు మీద పక్షుల గూళ్ళు కనపడితే చాలు కట్టెతో చిందరవందర చేసి పగల కొడతాడు. రాళ్లతో పిట్టలను పావురాలను చిలకలను గురిచూసి బలంగా కొడతాడు. కుక్కలు పందులు కనపడితే చాలు రాళ్లు విసురుతాడు. అవి బాధతో మూలుగుతావుంటే ఎగురుతా సంబరపడతాడు. మా తరగతి పిల్లలందరూ మీ అన్న చానా చెడ్డ పిల్లోడు అంటూ తిడతారు. ఆ మాటలకు వాళ్ల ముందు తలెత్తుకొని తిరగ లేకుండా ఉన్నాను అని చెప్పింది.
ఆ మాటలకు అమ్మ చానా బాధపడింది.
రవిని దగ్గరికి తీసుకుని... చూడు రవీ... మన చెయ్యో కాలో విరిగితే మనం ఎంత బాధ పడతామో, వాటి చెయ్యో కాలో విరిగితే అవీ అంతే బాధ పడతాయి. చీమయినా , కుక్కయినా, పందయినా , మనిషయినా అన్నింటికీ నొప్పి ఒకటే కదా. అవి మూగ జీవులు కాబట్టి ఆ బాధను బయటకు చెప్పుకోలేవు. చిన్నచిన్న జంతువులకు చేతనైతే సాయం చేయాలి... అంతేగాని బాధ పెట్టకూడదు.
నీవు వాటినలా బాధపెడతా ఉన్నందుకే నీకు ఈ రోజు ఇలాంటి కల వచ్చింది అనింది.
రవికి మరలా కల కళ్ళముందు మెదిలింది.
చీమ కాలు విరగ్గొడతా వుంటే బాధతో కేకలు పెట్టడం, గిలగిలా కొట్టుకోవడం అంతా మతికి వచ్చింది. నుదిటి మీద చిన్నగా చెమటలు పట్టాయి. సిగ్గుతో తల వంచుకున్నాడు. కళ్ళలోంచి నీళ్ళు కారాయి.
నిజమే అమ్మా... నువ్వు చెప్పింది. ఇంకెప్పుడూ ఏ చిన్న జంతువుకూ ఎటువంటి ఆపదా తల పెట్టను. కలతో నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు.
అమ్మ ఆనందంతో రవి నుదిటి మీద చిన్నగా ముద్దుపెట్టుకొంది.
*********
No comments:
Post a Comment