[7/18, 10:47] +91 79819 72004: *ఆకలేస్తే ఆలోచన పుడుతుంది. ఆలోచన పుడితే కార్యాచరణ తడుతుంది. ఆచరిస్తే కడుపు నిండుతుంది.*
*సంపాదించి పెట్టేవాళ్ళు లేనప్పుడు ఎలా సంపాదించాలి అనే ఆలోచన రాదు. సంపాదన మొదలవుతుంది. ఎందుకంటే, సమయం ఉండదు, అవసరం ఆగదు.*
*సంపాదన మొదలయ్యాక, ఎలా పెంచుకోవాలి అనే ఆతృత అవసరమైన విద్యను అందిస్తుంది. చదువు పూర్తి చేసి, అప్పుడు సంపాదన గురించి ఆలోచించే వారికంటే, వీరే జీవితంలో లక్ష్యాలు సాధిస్తారు.*
*ఆలోచన, ఆచరణలలో ఏది ముందు, ఏది తరువాత అనే సందిగ్ధం నెలకొని వుంటే, ఆచరణే ముందు. అందులోంచి వచ్చే అలోచన అమూల్యమైనది.*💪
*కృషితో నాస్తి దుర్భిక్షం.*
*శుభోదయం.*🙏
[7/18, 10:48] +91 79819 72004: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
' గుర్తింపు లేని బాధ్యత '
జీతం లేని పనిమనిషి - 'అమ్మ'
అమ్మా నీకు జీతమెంతమ్మ
వారం తో నీకు పనిలేదమ్మ
నెలంతా నీకు పనిదినములేనమ్మ
శలవేలేదమ్మ
భగవంతుడు ఇచ్చెను మూడురోజుల శెలవమ్మ
కలిలోన కలిపేస్తె దానికేది విలువమ్మ
తగ్గదు నీ పనిభారమమ్మ
అర్థం చేసుకునే - సమయం, తెలివి - ఎవరికీ లేవమ్మ
దేవుడు - తన అంశతో - నిను సృష్టించెనమ్మ
ఆడ, ఈడ - నెగ్గుకొస్తవని - ఆడపిల్లగా - పుట్టించెనమ్మ
మనిషిలా ఉండే యంత్రమే నీవమ్మ
స్వేదం, ఖేదం - తప్ప - సౌఖ్యమేదమ్మ
అత్తగారి ఆరళ్ళు, ఆడబిడ్డల అదిరింపులు - అడ్డేవమ్మ
బిడ్డనుమోసి, చావు చవి చూసి - కని - ప్రేమ పంచేవమ్మ
వంశాకురాన్నిచ్చి- అత్తింటి వృద్ధి - చేసేవమ్మ
తిండి, నిద్ర, సరదా - తక్కువేనమ్మ
పిల్లలంటే శ్రద్ధ , పెనిమిటంటే ప్రేమ - నీకమ్మ
గురువు, దైవమై - పిల్లల పెంచేవమ్మ
పిల్లలే ధనం, పెనిమిటే ఘనం - నమ్మేవమ్మ
కటిక పేదైన, కుబేరుడైన - తారతమ్యాలు చూడవమ్మ
పస్తుండి, నీ వంతు పెట్టు - అన్నపూర్ణవమ్మ
కొడుకు, కోడలు, పెనిమిటి - ఎవరైనా, తప్పు సర్ది, తను సర్దుకునే - నైజం నీదమ్మ
ఇంటికి దీపం, దైవం - నీవేనమ్మ
తల్లీ నీకు - వందనమమ్మ,
దీవించి - అందరినీ- క్షమించి - కాపాడవమ్మ
నా ఇల్లు, నావాళ్లు తప్ప- వేరే ధ్యాస - లేదమ్మ
చితినెక్కువరకు - చింతిస్తవమ్మ
అందమైన బొమ్మ - ఎంత ఓపికమ్మ
గుర్తింపు లేని బాధ్యతలు - మోసేవమ్మ
జీతభత్యం లేని - పనిమనిషి - నీవమ్మ!
బొమ్మా నీకు మురిపాలమ్మ
చెల్లీ నీకు రక్షెవరమ్మ
కొమ్మా నీకు తోడెవరమ్మ
తల్లీ నీకు శిక్షేనమ్మ !!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మణ్యం చెన్నై
నా స్వీయ రచన
No comments:
Post a Comment