Tuesday, 10 June 2025

 Parimala Biradavolu 

ఆ రోజు శనివారం ఐనా, ఆఫీస్ పని ఉండడంతో ఇంట్లోనే ఉండి పని చేసుకుంటున్నాడు వాసు. ఇంట్లోకి కావలసిన వస్తువులు తేవడానికి లత బజారుకి వెళ్ళింది. 
లత, వాసు ఉద్యోగ రీత్యా చెన్నైలో ఉంటున్నారు.
ఇద్దరు పిల్లలు వాళ్ళకి, అర మరికలు లేని ముచ్చటైన  సంసారం వాళ్ళది. 
లత సూపర్ మార్కెట్ లో ఉండగానే వాసునుంచి ఫోన్ వచ్చింది. ఊరినుండి ఫోన్ వచ్చింది అమ్మకు బాగలేదంట, వెంటనే ఇంటికి రమ్మని, కంగారుగా ఇంటికి వచ్చింది లత. అప్పటికే బాగ్ రెండు జతల బట్టలు సర్ధుకుని రెడీగా ఉన్నాడు వాసు, ఏమైంది అత్తమ్మకు కంగారుగా అడిగింది లత.
అమ్మ పడిందంట కాలుకి దెబ్బ తగిలిందంట. పక్కింటి నారాయణ ఫోన్ చేశాడు, నెల్లూరికి తీసుకుని పోతున్నారంట, రామచంద్రారెడ్డి హాస్పిటల్ లో చూపిస్తున్నారు, నేను బయలుదేరుతున్నాను అన్నాడు వాసు.
నేను కూడా వచ్చేదా అంది లత. వద్దులే నేను వెళ్ళాక పరిస్థితిని బట్టి చెప్తాను అని జాగ్రత్తలు చెప్పి వాసు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఫోన్ చేశాడు వాసు "అమ్మ  కాలు విరిగింది ఆపరేషన్ చేయాలి అంటున్నారు, నువ్వు వెంటనే బయలుదేరు అని," 
ఇలాంటిదేదో అవుతుందని అనుకుంటూనే ఉంది లత. అందుకే పిల్లలను అక్కడే ఉంటున్న తమ్ముడి ఇంటికి పంపడానికి అన్ని సిద్ధం చేసింది.
వాసునుంచి ఫోన్ రాగానే పిల్లలను తమ్ముడి ఇంట్లో వదిలి పెట్టి నెల్లూరికి బస్ ఎక్కింది లత.
బస్సు చెన్నై  సిటీ దాటింది, వాసుకి ఫోన్ చేసి చెప్పింది బయలు దేరానని, 
లతకి ఎంత వద్దనుకున్నా గతం గుర్తుకు రాసాగింది. పెళ్ళైనప్పటి నుండి ఈ పదేళ్ళు అత్తమ్మ, ఎలా ఆమె ప్రవర్తనతో తనని బాధ పెట్ఠింది, తన వాళ్ళను ఎలా అవమాన పరచింది. అంతా ఒకసారి మళ్లీ కళ్ళ ముందుకు వచ్చింది.
అత్తమ్మది చాలా దురుసు స్వభావం, తన మాటే నెగ్గాలనే పంతం ఎక్కువ, లత మామగారు కూడా ఆమెను ఏమీ అనేవారు కాదు. దాంతో ఆమెకు తను ఏది చేసినా  కరెక్ట్  అని, తనవల్ల తప్పులే జరగవని అహంకారం పెంచేసుకుంది. 
అన్నిటినీ ఓర్చుకున్న లత, తన అమ్మ నాన్నలను కూడా అవమానకంగా మాట్లాడుతుంటే ఓర్చుకోలేక  పోయింది.  గొడవ పడింది, వాసు ఎటూ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు.
అత్త మామలను గౌరవించే  క్రమంలో అమ్మ నాన్నలకు అవమానం జరుగుతుంటే సహించలేక పోయింది. 
ఆరోజు ఆ ఇంటినుండి బయటకు వచ్చిందంటే మళ్ళీ  వెళ్ళలేదు. రెండేళ్లవుతుందేమో అత్తమ్మను చూసి. బంధువులద్వారా, ఊళ్ళో స్నేహితులద్వారా ఆమె విషయాలు తెలస్తుంటాయి.
రెండు రోజులకు ఒకసారైనా  నెల్లూరు టౌనుకి వెళ్లాలి ఆమె, ఊరంతా ఒక రౌండు వేసి వస్తుంది రోజు.
ఊళ్లోవాళ్ళు వాసుకి చెప్పే వారు అమ్మను అలా తిరగవద్దు అని చెప్పమని.  కాని ఆమే ఎవరి మాట వినదు  అని కూడ అందరికి తెలుసు.
వాసు చెప్పడానికి చూసినా  వినిపించుకునేది కాదు, పైగా నన్ను ఎవరూ చూడనవసరం లేదు. నాకు మీ సహాయం అవసరం లేదు అనేది పొగరుగా. లత వెళ్ళకపోయినా వాసు నెలకి ఒకసారి వెళ్లి వాళ్ళ అమ్మను చూసి వస్తుంటే వాడు.
లత ఆలోచనలనుండి బయటకు వచ్చింది. బస్సు నాయుడుపేటకి వచ్చింది. సాయంకాలం అవుతుంది, కిటికీనుండి బయటికి చూస్తుంది, రోడ్డు పక్క ఇళ్ళల్లో అందరూ సందె కసువు చిమ్ముకుని నీళ్లు చల్లి సందె ముగ్గు పెడుతున్నారు, చేలల్లో నుంచి పశువులను ఇళ్ళకు తోలుకోని పోతున్నారు, బడి నుండి వచ్చిన పిల్లలు ఇంకా వీధుల్లో ఆటల మీదనే ఉన్నారు. 
లత మళ్ళీ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. ఇంత చేసిన ఆమెకు ఇప్పుడు వెళ్ళి సేవ చేయాలి, ఎలా మనసెలా వస్తుంది, మంచి చెప్పినపుడు వినలేదు, ఇప్పుడు కాలు విరిగింది, అన్ని మంచంలోనే చేయాలి, డబ్బులు ఇచ్చినా చేసే మనుషులు లేరు. మనసు విరిగిపోయినాక ఎలా సేవలు చేయాలి అసలు చేయగలనా.... ఇలా రకరకాల ఆలోచనలతో లత తల వేడెక్కి పోయింది.
ఆలోచనల్లో ఉండగానే గూడూరు వచ్చింది. బస్టాండు లో రెండు కప్పుల  కాఫీ తాగింది అవును మరి ఒక కప్పులో రెండు గుక్కలకంటే ఎక్కువ కాఫీ ఉండదు.
బస్సు కదిలింది లత ఆలోచనలు కూడా..... ఇప్పుడు అత్తమ్మను చూసుకోవాలి అది తన భాద్యత. ఇది లతవైపు ఆలోచన, కాని అత్తమ్మవైపు ఆలోచిస్తే ఈ పరిస్థితులలో ఆమె కోరుకునేది ప్రేమ ఆప్యాయత, అయిందేదో అయిపోయింది నువ్వు భయపడకు నేను చూసుకుంటాలే అని లత నుండి భరోసా,
కాని తనని అన్ని బాధలు పెట్టిన అత్తమ్మను ఎప్పటికైనా సమాధానం అడిగి తన  ఆవేదన తీర్చుకోవాలని ఉంది   లతకి, ఆ ఆవేదన తీరకుండా అత్తమ్మతో ప్రేమగా ఉండలేదు. అలాగని తన భాద్యత  వదిలి పెట్టలేదు. ఏమి చేయాలి, ఎలా చేయాలి భాద్యత అనుకుని చేస్తే లత మనసులో ఆవేదన తాలూకు వెలితి అలాగే ఉంటుంది, అత్తమ్మకు కూడా భాద్యతలోని బరువు కనిపిస్తుంది, అలా ఇద్దరూ అసంతృప్తిగానే ఉంటారు.
ప్రేమగా ఆప్యాయంగా సేవ చేస్తే అత్తమ్మ సంతోష పడతారు, తృప్తి పడతారు,లత మనసులో ఆవేదన క్రమంగా తగ్గిపోతుంది ఎందుకంటే  అన్ని బాధలను, దుఃఖాన్ని  నశింప చేసే ఔషధం ప్రేమ .ఆ ఆవేదన స్థానంలో ఆప్యాయత నిండిపోతుంది మనసు తేలిక పడుతుంది. ఇద్దరూ తృప్తిగా ఉంటారు.
కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న లత బస్సు కుదుపుకి కళ్ళు తెరిచి కిటికీ నుండి బయటకి చూసింది, ముసురుకొన్న మబ్బులన్నీ విడిపోయి నిర్మలమైన ఆకాశం ప్రశాంతం గా కనిపించింది. అచ్చంగా లత మనసు లాగానే.
అత్తమ్మ లతకు బాధను, దుఃఖాన్ని ఇచ్చింది, కానీ ఇవి ఇతరులకు ఇవ్వతగినవి కావు, మనకు ఎవరైనా ఇచ్చినా వెంటనే తీసి బయట పడవేయవలసినవి. అందుకని వాటిని తిరిగి అత్తమ్మ  ఇవ్వడానికి లత మనసు ఒప్పుకోలేదు.
కాని ప్రేమ, ఆప్యాయతలు అందరికీ పంచవలసినవి, బ్రతికినంత కాలం పదిలం దాచుకో వలసినవి. అందుకని వాటినే లత తన అత్తమ్మకు ఇవ్వాలనుకుంది. 
ఇప్పుడు లత మనసు చాలా నిలకడగా ఉంది, ప్రశాంతంగా ఉంది. బస్సు నెల్లూరు టౌన్లోకి వచ్చేసింది. అత్తా కోడళ్ళ  అందమైన అధ్యాయం ఆరంభమం  అవబోతుంది....

🙂
 🚩🚩-#ఇడ్లీ_ఆకులు..!
*" ఏమి తల్లీ ఇప్పటికి ముప్పది ఏండ్లుగా కాపురము చేయుచున్నాను అని చెప్పినావు. మరి ఇప్పుడు విడాకులు ఎందుకు అడిగేదీ ఈ కోర్టు వారికి వివరించి చెప్పమ్మా! అని జడ్జీ గారు అడిగిరి. 
ఆ ఇల్లాలు ఇట్లన్నది 
" నా ఖర్మ బాగో లేక నాకు పదహారో ఏటనే పెండ్లి అయినది.
మా వారికేమో ఇడ్లీల పిచ్చి. ఈ పిచ్చి వారికి వారి అమ్మమ్మ చేసి తిన పెట్టిన అవిటి కుడుముల వల్ల  వచ్చినది. ఆయనకు రోజూ ఇడ్లీలు కావలెను. అవి తినిన కానీ దుక్క బలవనని ఆయన నమ్మకము. అవియన్న నాకు డోకు. చివరికి వేవిళ్లు సమయమున కూడా చింతకాయ పచ్చడి నంజుకొని ఇడ్లీలే తింటిని.
డోకులు + వేవిళ్లు కలిపి చచ్చి బ్రతికి నట్లాయితిని. 
మావారు వూరిలో ఎక్కడ కొత్తగా పాక హోటల్ వెలిసిన ను అక్కడికల్లా వెళ్లి తాను  ఇడ్లీలు తినివచ్చి - నాకిన్ని తెచ్చి ఇచ్చును. 
ఆ మరునాడు నేను ఆ ఇడ్లీలను పోలిన ఇడ్లీలు అల్లం చెట్నీలు కారపు పొడులు చేయవలెను. ఏ మాత్రము తేడా వచ్చినా సహింపరు. నాతో ఎడమొఖం పెడమొహం వేద్దురు. ఆదివారం నాడు ఏదన్న స్టార్ హోటల్ నుండి ఇడ్లీ తెచ్చుకొని, తిని - ఆ మరునాడు నుండీ నేను  వారిలాగా సాంబారు సప్లై చేయలేదని  నా మీద అలుగుదురు.  ఆయన ఏ  రోజున ఏ  ఊపున ఎన్ని ఇడ్లీలు తిందురో నావూహకు అందదు. రొండు ఇడ్లీకి రొండు జగ్గులు సాంబారు చొప్పున చేయ నా వల్ల అగుటలేదు. నాకు లెక్కలు లో తక్కువ మార్కులు.  ఇది కాక  ఇడ్లీ పిండి నేనే రుబ్బనిచో ఆయనకు రుచిలో తేడా కొట్టును. మిక్సీ  వేసినది ఆయన వంటికి వేడి ఆట.   ఇడ్లీలలోకి కారంపొడి నేను దంచవలెను.
♦️అల్లం చెట్నీ రుబ్బవలెను. వెన్న చిలికి అచ్చ నేయి కాచవలెను.  అప్పుడప్పుడు డ్రాయింగ్ కూడా గీసి ఇచ్చి ఇడ్లీ సైజు చెప్పెదరు. ఆ రకముగా చేసినచో పట్టు చీర అని ఆశపెడుదురు. ఈనాటి ఇడ్లీ వల్ల నాకు పట్టు చీర వచ్చునో లేదో అని నాకు టెన్షన్ వచ్చును. ఇప్పటివరకూ నాకు ఒక్క పట్టు చీరా రాలేదు - పిచ్చి తిక్క మాత్రము వచ్చినది. అప్పుడప్పుడు దోస అంత ఇడ్లీ వేయమని - ఇంకో సారి రూపాయ బిళ్ళంత చిట్టి ఇడ్లీలు వేయమని అడుగుదురు. 
నాకొడుకు ఇప్పడు పాతిక ఏండ్లవాడైనాడు. వాడికి మొదటిలో పూరీల పిచ్చి. వాళ్ళ నాన్నకు తెలియకుండా వాడు పూరీలు తిని నాకు తెచ్చుచుండెడి వాడు. ఇప్పుడు వాడికి గ్యాస్ వచ్చి, వాడు కూడా ఇడ్లీలపై పడినాడు.
♦️పురిటి కి పోయిన నా కోడలు తిరిగి వచ్చినది. ఆ పిల్ల కూడా - తన కొడుకు క్షేమము కొరకై - నాకొడుకు తో పాటు కూచొని ఇడ్లీలు మాత్రమే తినుచున్నది. ఆమె  బాలింత కాన,  కాచిన నేయి,  వేచిన కరివేపాకు కారం పొడి ఆమెకు తప్పక ఉండవలెను. నా కూతురు కొడుకున్నాడు. అందరూ కలిపి వాడికి నేతి ఇడ్లీలు తినుట మప్పినారు. వాడు స్కూల్ ఆటో లో స్కూల్ కు పోవుచూ, ఒక్క క్షణము లోనికి వచ్చి - ఇడ్లీ ఇడ్లీ అని టిఫిన్ బాక్స్ చూపును. అందులో ఇడ్లీతో పాటు ఆవకాయ - టమోటా జ్యూస్ వేయవలెను. అందరూ వెళ్లిరి అనుకొనుచున్నంతలో "అమ్మా ఇడ్లీలు వున్నవానే. నేను ఉల్లి దోసెలు తింటిని గానీ కడుపు నిండలేదు" అనుచూ నా కూతురు వచ్చును. దానికి ఇడ్లీలు మప్పినది దాని తండ్రియే. ఈ రకముగా నేను ప్రతి రోజు సాయంత్రము నాలుగు నుండి ఎనిమిది వరకూ మరునాటి ఇడ్లీలకు ప్రేపరేషన్లు - ఉదయము ఆరు నుండి పది వరకు ఆరారగా వేడి వేడి ఇడ్లీ వేయుచూ తీయుచూ కాలము గడుపుచున్నాను. చుట్టు పక్కల పిల్లలు నన్ను ఇడ్లీ బామ్మ అనుచున్నారు - ఇదంతా ఈయన వల్లనే. సహధర్మచారిణిగా నేనుకూడా ఆయనకు పుట్టినదే  తినవలయునని రూలు కదా! ఈయన ఇడ్లీ పిచ్చి వల్ల నేను - బొండాలు బజ్జీలు పూరీలు ఉల్లి దోశలు  ఊతప్పలు ఎరుగను. నాబ్రతుగు ఇడ్లీ పాలు చేసినాడు. ఎప్పటికీ విముక్తి కలగనట్లు తోచుచున్నది. నాకు విడాకులిచ్చి నన్ను రక్షింపవలసినదని చెప్పుకొని కోరుచున్నాను" అని ఆ ఇల్లాలు ముగించినది.
జడ్జీ గారు ఓర్పుగా అంతా వినిరి. అడ్డు ప్రసంగాలు చేయలేదు. అందున మన కధ నేరుగా హంస నడక నడిచినది. చివరికి ఆయన ఇట్లనిరి...
♦️"అమ్మడూ - ఇడ్లీకోసము విడాకులు అడుగుట.. ఇచ్చుట ఈ కోర్టులు ఒప్పవమ్మా - సరే కానిమ్ము కానీ నీవు కోరినన్ని రకాల టిఫిన్లు కోరినన్ని పొట్లాలు నీకు ఇప్పించవలసిందిగా నీ కోడలికి ఆర్డర్ వేయుచున్నాను. ఆమె తన నెల జీతములోనుండి నీకు అన్ని టిఫిన్లు ఇప్పించవలెను. ఇకపై నీముందు ఇడ్లీ పేరెత్తినా, ఇడ్లీ చేయమని నీకు హుకూం వేసినా - మూడు నెలల జైలు శిక్ష తప్పదని నీ మగాడికి హెచ్చరించుచున్నాను - నా తీర్పు నీకు ఆనందము కలుగ చేయని యెడల రేపు వచ్చి నా ఇంటి తలుపు తట్టుము" అని తీర్పు ఇచ్చిరి.
😀 ఇడ్లీ ప్రియులకు అంకితం ☺️
Sri C. Narenderbabu,
 ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం వెనుక తెలుగు మహిళ ఇంజనీర్!  ప్రొఫెసర్ మాధవి లత: భారతదేశ ఇంజినీరింగ్ రంగంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం!  తెలుగు తేజం ప్రొఫెసర్ మాధవి లత గారికి అభినందనలు!!

      🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంగా ఉన్న చినాబ్ వంతెన రెండు ఎత్తైన కొండల నడుమ విల్లు ఆకారంతో అత్యంత ఎత్తున ఇనుముతో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతం చినాబ్ వంతెన. ఈ చినాబ్ బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఓ తెలుగు మహిళా ఇంజనీర్ ఆవిడే డా.జి .మాధవీలత. 
......
21 ఏళ్ల పాటు సాగిన ఈ రైల్వే వంతెన నిర్మాణంలో హిమాలయ ప్రాంతంలోని సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులను అధిగమించడంలో తెలుగు మహిళ ఇంజనీర్ పాత్ర, నైపుణ్యం కీలకంగా ఉంది. 2005 నుంచి 2022 వరకు 17 సంవత్సరాల పాటు మాధవి లత చినాబ్ ప్రాజెక్టులో నార్తర్న్ రైల్వే కాంట్రాక్టర్ అఫ్‌కాన్స్‌ వారికీ జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా సేవలందించారు.

◾ ప్రాజెక్టు నిర్మాణం కీలక పాత్ర....

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో స్థిరమైన డిజైన్ లేకుండా, మాధవీలత బృందం " డిజైన్-అన్ -యు-గో"  విధానాన్ని అవలంబించడం  జరిగింది. పగుళ్ల రాళ్లు, దాచిన కుహరాలు, అనూహ్య భౌగోళిక పరిస్థితులను ఎదుర్కొంటూ రియల్-టైమ్‌లో డిజైన్‌లను సవరించారు. సీస్మిక్ జోన్‌లో ఉన్న చినాబ్ వంతెన 120 సంవత్సరాల పాటు ఉండేలా, గంటకు 260 కిలో మీటర్ల వేగంతో వచ్చే గాలులు, భూకంపాలను తట్టుకునేలా నిర్మితం కావడంలో స్లోప్ స్టెబిలిటీ, రాక్ యాంకర్స్, ఫౌండేషన్ డిజైన్‌లలో ఆమె సలహాలు అమలు చేయడం జరిగింది.

◾ఈ మాధవి లత గారు ఎవరు ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలోని యడుగుండ్లపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన మాధవి లత గారు, కాకినాడ JNTU నుంచి B.Tech, NIT వరంగల్ నుంచి M.Tech (గోల్డ్ మెడల్), IIT మద్రాస్ నుంచి Ph.D (2000) పూర్తి చేశారు. 2003 నుంచి IIScలో ప్రొఫెసర్‌గా, ప్రస్తుతం సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2021లో ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ నుంచి బెస్ట్ ఉమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్ అవార్డు సైతం అందుకున్నారు. 2022లో భారతదేశంలోని టాప్ 75 ఉమెన్ ఇన్ STEAMలో చోటు దక్కించుకున్నారు
......
ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. IIScలో మొదటి మహిళా ఫ్యాకల్టీగా, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ భవనంలో మహిళల కోసం టాయిలెట్ సౌకర్యం కోసం మాధవీలత పోరాడారు. ఆమె ల్యాబ్‌ను మహిళా విద్యార్థులకు సమాన అవకాశాల కల్పనకు కృషి చేశారు. 2007లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి టీచర్ ఎక్స్‌ట్రాఆర్డినరీ అవార్డును మాధవీలత అందుకున్నారు. తెలుగు సంతతికి చెందిన మాధవి లత, ఒకప్పుడు డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ ఇంజనీరింగ్‌ వైపు మళ్ళీ చినాబ్ వంతెన నిర్మాణంలో తన సేవలు అందించి  చరిత్ర సృష్టించారు.
......
ఇటీవలే ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్ మహిళా ప్రత్యేక సంచికలో 'డిజైన్ యాజ్ యూ గో: ది కేస్ స్టడీ ఆఫ్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్' అనే పేరుతో ఆమె ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. స్థలంలోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా, వంతెన మొత్తం నిర్మాణం, ప్రదేశం, రకం స్థిరంగా ఉండగా, డిజైన్ ఎలా నిరంతరం రూపాంతరం చెందిందో ఈ పత్రం వివరిస్తుంది.
.....
భారతదేశంలోని ఇంజినీరింగ్ రంగంలో తూర్పు దిశగా వెలుగొందుతున్న ప్రొఫెసర్ మాధవి లత, తన అసాధారణ పరిశోధనలు, అంకితభావం మరియు దేశీయ అభివృద్ధి ప్రాజెక్టులలో చేసిన కృషతో ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC)లో ప్రొఫెసర్‌గా, అలాగే సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్‌కు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె, భూకంప జియోటెక్నికల్ ఇంజనీరింగ్, జియోసింథటిక్స్, మరియు రాక్ ఇంజనీరింగ్ రంగాలలో తనదైన ముద్ర వేసారు. ఈ వ్యాసం ప్రొఫెసర్ మాధవి లత యొక్క విద్యా పురోగతి, పరిశోధనా కృషి, చీనాబ్ రైల్వే వంతెన ప్రాజెక్టులో ఆమె పాత్ర, మరియు ఆమె సాధించిన గౌరవాలను వివరిస్తూ, ఆమె జీవన గాథను సమగ్రంగా అందిస్తుంది.

◾ విద్యా పురోగతి: బలమైన పునాది....

ప్రొఫెసర్ మాధవి లత యొక్క విద్యా యాత్ర ఆమె అసాధారణ ప్రతిభ మరియు అంకితభావానికి నిదర్శనం. ఆమె తన బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (B.E.) డిగ్రీని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU), కాకినాడ నుండి పొందారు. ఈ ప్రాథమిక విద్య ఆమెకు సివిల్ ఇంజనీరింగ్ రంగంలో బలమైన పునాదిని అందించింది. ఆ తర్వాత, ఆమె నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), వరంగల్ నుండి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (M.Tech.) డిగ్రీని సాధించారు, ఇక్కడ ఆమె తన జియోటెక్నికల్ ఇంజనీరింగ్ పట్ల ఆసక్తిని మరింత బలోపేతం చేసుకున్నారు.
......
ఆమె విద్యా యాత్రలో అత్యున్నత స్థాయి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), మద్రాస్ నుండి పొందిన డాక్టరేట్ (Ph.D.). ఈ డిగ్రీ సమయంలో, ఆమె భూకంప జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌పై లోతైన అధ్యయనం చేసి, ఈ రంగంలో కీలకమైన ఆవిష్కరణలకు దోహదపడ్డారు. ఈ విద్యా స్థాయిలు ఆమెకు సాంకేతిక నైపుణ్యం మరియు పరిశోధనా దృష్టిని అందించాయి, ఇవి ఆమె తదుపరి వృత్తి జీవితంలో కీలక పాత్ర పోషించాయి.

◾పరిశోధనా కృషి: జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లో అగ్రగామి...

ప్రొఫెసర్ మాధవి లత యొక్క పరిశోధనా ప్రాంతాలు భూకంప జియోటెక్నికల్ ఇంజనీరింగ్, జియోసింథటిక్స్, మరియు రాక్ ఇంజనీరింగ్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రంగాలలో ఆమె చేసిన పరిశోధనలు భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆమె 70కి పైగా పరిశోధనా పత్రాలను ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు, ఇవి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించాయి.
......
ఆమె 2016 నుండి 2022 వరకు "ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్" కు ఎడిటర్‌గా వ్యవహరించారు, ఈ సమయంలో ఆమె జర్నల్ యొక్క నాణ్యత మరియు అంతర్జాతీయ గుర్తింపును మెరుగుపరిచారు. ఆమె పరిశోధనలు భూకంప ప్రాంతాలలో నిర్మాణాల భద్రత, జియోసింథటిక్ మెటీరియల్స్ యొక్క వినియోగం, మరియు రాక్ స్ట్రక్చర్స్ యొక్క స్థిరత్వంపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రంగాలలో ఆమె చేసిన ఆవిష్కరణలు భారతదేశంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు దోహదపడ్డాయి.

◾ చీనాబ్ రైల్వే వంతెన: ఒక చారిత్రాత్మక సాధన....

ప్రొఫెసర్ మాధవి లత యొక్క అత్యంత గుర్తింపు పొందిన సాధనలలో ఒకటి జమ్మూ-కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించబడిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ప్రాజెక్టులో ఆమె పాత్ర. ఈ ప్రాజెక్ట్, భారతీయ రైల్వేల ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లైన్ (USBRL)లో భాగం, ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుతమైన సాంకేతిక విజయం.
......
ఈ వంతెన నిర్మాణం అత్యంత సవాళ్లతో కూడిన ప్రాజెక్ట్, ఎందుకంటే ఇది హిమాలయ పర్వత ప్రాంతంలో, కొండచరియలు, భూకంప ప్రామాఖ్యం, మరియు అధిక గాలి వేగం ఉన్న ప్రాంతంలో నిర్మించబడింది. ప్రొఫెసర్ మాధవి లత ఈ ప్రాజెక్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు, ముఖ్యంగా వంతెన యొక్క పునాది, నిర్మాణ రూపకల్పన, మరియు భద్రతా హామీలను పర్యవేక్షించారు. ఆమె జియోటెక్నికల్ ఇంజనీరింగ్‌లోని నైపుణ్యం, కొండచరియల విరిగిపడే ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు భూకంప స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కీలకమైనది.
......
17 సంవత్సరాల నిరంతర కృషి, అంకితభావం, మరియు సాంకేతిక దక్షతతో, ప్రొఫెసర్ మాధవి లత ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ వంతెన భారతీయ రైల్వేలకు ఒక చిరస్థాయి గర్వకారణంగా నిలిచింది మరియు దేశంలోని సవాళ్లతో కూడిన భూభాగాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచింది.

◾గౌరవాలు & పురస్కారాలు.....

ప్రొఫెసర్ మాధవి లత యొక్క కృషి ఫలితంగా ఆమె అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను అందుకున్నారు. 2022లో, ఆమె భారతదేశంలోని "టాప్ 75 మహిళలు" జాబితాలో చేర్చబడ్డారు, ఇది ఆమె ఇంజినీరింగ్ రంగంలో చేసిన అసాదరణ కృషికి గుర్తింపు. 2024లో, ఆమె  "ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్" (INAE) యొక్క "ఫెలో" గా ఎన్నికయ్యారు, ఇది భారత ఇంజనీరింగ్ రంగంలో అత్యున్నత గౌరవాలలో ఒకటి.
.....
అంతేకాక, ఆమె ఇండియన జియోటెకనికల్ సొసైటి (IGS)లో కీలక సభ్యురాలిగా ఉన్నారు మరియు ఈ సంస్థ ద్వారా జియోటెక్నికల్ ఇంజనీరింగ్ రంగంలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆమె విద్యార్థులకు మార్గదర్శకంగా, సహోద్యోగులకు స్ఫూర్తిగా నిలిచి, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ, ఈ రంగంలో మహిళల పాత్రను బలోపేతం చేస్తున్నారు.

◾సామాజిక & సాంస్కృతిక ప్రభావం....

ప్రొఫెసర్ మాధవి లత యొక్క కృషి కేవలం సాంకేతిక రంగంతోనే పరిమితం కాదు. ఆమె చీనాబ్ వంతెన వంటి ప్రాజెక్టుల ద్వారా భారతదేశంలోని సవాళ్లతో కూడిన భూభాగాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచి, దేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదపడ్డారు. ఈ ప్రాజెక్ట్ జమ్మూ-కాశ్మీర్‌లోని స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నతం చేసింది మరియు  దేశ ఐక్యతను బలోపేతం చేసింది.
......
అంతేకాక, ఆమె ఒక మహిళా ఇంజనీర్‌గా, సాంప్రదాయ అడ్డంకులను ఛేదించి, ఈ రంగంలో మహిళల పాత్రను బలోపేతం చేసింది. ఆమె విజయాలు యువతులకు స్ఫూర్తినిచ్చాయి మరియు  STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మరియు గణితం) రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రోత్సహించాయి.

◾అసాధారణ ఇంజనీర్, పరిశోధకురాలు.....

ప్రొఫెసర్ మాధవి లత ఒక అసాధారణ ఇంజనీర్, పరిశోధకురాలు, మరియు సమాజ సేవకురాలు, ఆమె భారతదేశ ఇంజనీరింగ్ రంగంలో తనదైన ముద్ర వేసారు. చీనాబ్ రైల్వే వంతెన వంటి ప్రాజెక్టులలో ఆమె చేసిన కృషి, 70కి పైగా పరిశోధనా పత్రాల ప్రచురణ, మరియు ఆమె సాధించిన గౌరవాలు, ఆమె అంకితభావం మరియు పట్టుదలకు నిదర్శనాలు. ఆమె జీవన గాథ యువతకు స్ఫూర్తినిస్తుంది మరియు భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది.
.....
ప్రొఫెసర్ మాధవి లతయొక్క కృషికి మనమందరం సెల్యూట్ చేద్దాం!

మహమ్మద్ గౌస్ 

        🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
 *_“మిడతంభొట్ల శకునం”_*  
_[ఇదొక విచిత్రమైన సామెత. అదెలా పుట్టిందో తెలియాలంటే ఈ కథ చదవాల్సిందే..]_ 
-----------------------

*ఈ వ్యావహారిక పదం వెనక ఒక కథ ఉన్నట్లు చెబుతారు. ఎవరైనా పనిమీద వెళ్ళే టప్పుడు వేరేవారు ఎదురైనప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిన పని క్షణాల్లో జరిగి లాభం చేకూరితే.. అతని శకునం _"మిడతంభొట్ల శకునం"_ అంటారు.*

*ఒక అగ్రహారంలో మిడతంభొట్లు అనే పేరుగల సామాన్యుడైన బ్రాహ్మణుడుండే వాడు.*

*అతను బ్రతుకుతెరువు కోసం జనాలకు జాతకాలు, శకునాలు చెబుతూ వాళ్లిచ్చినది తీసుకొని బ్రతుకు బండి లాగిస్తుంటాడు. వాస్తవానికి అతనికి జాతకాల గురించి ఏమీ తెలియదు.*

*అతని అదృష్ట మేమో గానీ... అతను చెప్పింది నిజంగానే జరిగేది. ఒకవేళ ఎప్పుడైనా జరగక పోతే ఏదో విధంగా సర్ది చెప్పేవాడు.. దానితో మిడతంభొట్లు కీర్తి పెరిగి పోయింది. అతని దగ్గర ఏదో అతీత శక్తి ఉందని ప్రచారం జరిగింది.*

*ఈ విషయం ఆ దేశపు రాజుగారి దాకా వెళ్ళింది. ఆయన మిడతం భొట్లును పిలిపించి, నీ దివ్యశక్తితో నా పిడికిట్లో ఉన్నది ఏమిటో చెప్పమన్నాడు.* 

*తలవని తలంపుగా జరిగిన ఆ పరీక్ష అతని పాలిట మృత్యువని నిర్ధారించుకొని, ఏమని చెప్పాలో పాలుపోక ఆ బ్రాహ్మణుడు తన దుస్థితికి చింతిస్తూ, ఏడ్వలేక నవ్వుతూ రాగయుక్తంగా _"చిక్కావయ్యా మిడతం భొట్లూ రాజు చేతిలోన"..._ అంటూ ఆలపించాడు.*

 *రాజు పిడికిలి విప్పగానే అందులోని మిడత యెగిరి పోయింది. రాజు ఆ విప్రుని శక్తికి మెచ్చి, తన రాజ్యంలో ఉన్న ఏకైక జాతకరత్న మేధావి యని ప్రశంసించి, తన కొలువులో పదవి యిచ్చి గౌరవించాడు.*

*అచిరకాలం లోనే మిడతంభొట్లు పేరు రాజ్యమంతా మారుమ్రోగిపోయింది. పొగడ్తలు అతన్ని అందలం ఎక్కించాయి. అయినా మిడతం భొట్లుకు మాత్రం తను ఏ క్షణంలోనైనా ఉరికంభం ఎక్కవచ్చుననే భయం లోపల వెంటాడుతూనే ఉంది.*

*ఈ పరిస్థితుల్లో రాణిగారి వజ్రాలహారం కనిపించలేదు. రాణి గారు పనివాళ్ళనూ, దాసీలనూ ఎంత బెదిరించినా ఆ హారం ఎవరు తీశారో తెలియరాలేదు. విధిలేక రాణి గారు రాజుగారికి చెప్పారు. రాజుగారు మన మిడతంభొట్లు ఉండగా మనకేం భయం? అని మిడతం భొట్లును రమ్మని కబురు పంపించాడు.*

*రేపు ఉదయం లోపల దొంగ ఎవరో చెప్పాలని మిడతం భొట్లు ను ఆజ్ఞాపించాడు.. అతడు తను భయపడినంతా జరిగిందని విచారిస్తూ రాజప్రాసాదం దగ్గర పచార్లు చేస్తూ _"కాలి కొచ్చునో.. కంటి కొచ్చునో"_ అని పాడుకుంటూ తిరుగసాగాడు.(తన కాలే తెసేస్తారో, కన్నె తీసేస్తారో అని అలా పాడుతున్నాడు)*

*ఆ హారం కాలి, కంటి అనే ఇద్దరు దాసీలు తీశారు. వాళ్ళిద్దరూ మిడతం భొట్లు ఏమి చేస్తున్నాడోనని నక్కినక్కి చూస్తున్నారు. వాళ్ళు అతను పాడే పాట విన్నారు.* 

*'అమ్మో! ఈ అయ్య అసాధ్యుడే...! మనమే దొంగలమని కనిపెట్టేశాడు.' అని తమ పేరు రాజు గారికి చెప్తే తమకు శిక్ష తప్పదని భయపడి గజగజ వణుకుతూ ఏడుస్తూ వచ్చి మిడతంభొట్ల పాదాలపై పడి తామే ఆ నగను దొంగిలించామని ఒప్పుకొని హారం అతనికి యిచ్చి తమ పేర్లు బయట పెట్టొద్దని ప్రాధేయపడ్డారు.*

 *బ్రతుకు జీవుడా అని మనసులో అనుకోని మిడతంభొట్లు పైకి మాత్రం _"యిక మీదట యిలా చేశారంటే ఊరుకునేది లేదు వెళ్ళండి"_ అని గద్దించాడు. వాళ్ళు అతనికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు.*

*మిడతంభొట్లు రాజుగారి దగ్గరకు వెళ్లి ఒక దొంగ దగ్గర ఆ హారం దొరికిందనీ, వాడు హారం తన చేతిలో పెట్టి తనకు చిక్కకుండా పరిగెత్తి పోయాడనీ వెళుతూ వెళుతూ తాను దేశం విడిచి పెట్టి పోతున్నానని అరిచాడనీ... కల్పించి చెప్పాడు. అప్పటినుండీ _"మిడతంభొట్ల శకునం"_ అనే మాట వాడుకలోకి వచ్చింది.*
_(--Suguna Rupanagudi)_ 
--------------------- 
*_{💠🌹శుభోదయం🌹💠ఇది సేకరణే: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
---------------------
 *హా స్య ల హ రి*
  ఇంటి పేర్ల పురాణం !!

*తెలుగు మాస్టారా? మజాకా?*

తెలుగు మాస్టారు వచ్చీ రాగానే హాజరు పట్టీ అందుకున్నారు. కలం తీసి దానిమూత తీసి దాన్ని ఓ సారి అలవోకగా విదలించి, ఊఁ.......
ఓనమాల ఓంకారం, అచ్చుతప్పుల అప్పలాచారి, ఆటవెలది ఆనందరావ్, ఉత్పల ఉమాదేవి, చంపకమాల చంచలమ్మ, శార్దూలం శాంతమ్మ, మత్తేభుల మరకతమణి, మత్తకోకిల మహేశ్వరి, కందపద్యం కామేశ్వరి, తేటగీతుల దేవయాని, యతిప్రాసల యాచేంద్ర, అనుప్రాసల అనంతయ్య, అంత్య ప్రాసల అప్పన్న, విభక్తుల వినాయకరావు, సీసాల చినరామయ్య ఎత్తుగీతుల ఎంకటయ్య, శ్లేషల శేషాచలం, కూని రాగం కుటుంబరావు, వ్యాకరణం వసంతయ్య, ఛందస్సుల చంటి బాబు, వచనకవితల వంగపండు, హైకూల హైమవతి, ఆరుద్రపదాల ఆరుముగం, గ్రాంథికం గరుడాచలం, వ్య్వవహారాల వాసుదేవరావ్, పరుషాల పాపయ్యశాస్త్రి, సరళాక్షరం సంపత్కుమార్, అరసున్నల ఆదిలక్ష్మి, నిండు సున్ననిత్యానందం, అనునాసికం అప్పారావ్, శకట ఱేఫల శంకరయ్య, గురువుల గుండూరావు, లఘువుల లక్ష్మణరావు, ప్రకృతుల ప్రభాకరరావు, వికృతుల వీరాస్వామి, నామవాచకం నందకుమార్, విశేషణాల వీరభద్రయ్య, సర్వనామాల సంగీతరావు, భగణం భాస్కరయ్య సగణం సారయ్య, తగణం తాయారమ్మ
రగణం రంగాచారి, మగణం మావుళ్లయ్య, యగణం యాద్గిరి, నగణం నాగేంద్రుడు, జగణం జానకమ్మ, పద్యరచన పరమానందం, చివరగా ముక్తాయింపు మూర్తి రాజు. అమ్మయ్య,
అందరూ వచ్చారా, కూర్చోండి కూర్చోండి. ఏదోనర్రా ఈ రోజు మీకు వ్యాకరణం పాఠం చెబుదామనుకున్నాను. ఇదిగో ఇలా సరిపోయింది. సర్లే, రేపు చూసుకుందాం. ఈ రోజుకు ఇలా ......అదిగో గంట కూడా కొట్టారు.
శుభమ్.
 *_-—ఇదే… జీవితసత్యం—-_*
*_(ఇది ఎంత అద్భుతమైన, ఉత్తేజితమైన విషయమో...  చదివితేనే తెలుస్తుంది.)_*
*——————————*

*⚛️గాలివాన చెట్టును ఎంతగా ఊపితే, దాని వేళ్లు అంతగా గట్టిపడతాయి. అలాగే జీవితంలో కష్టాలు, ఆటుపోట్లు ఎంత ఎక్కువైతే మనిషిలో అంత సహనం, పట్టుదల పెరుగుతాయి.*

*👍మొక్క దృఢంగా ఎదిగిందంటే, అది ఎన్నో గాలివానల్ని తట్టుకుందని అర్థం. అలాగే మనిషి మహావిజేతగా నిలిచాడంటే అతడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాడన్నది నిజం. ప్రకృతి ప్రతికూలతలు కల్పిస్తున్న ప్రతీసారి, ప్రతిఘటించేందుకు మాను తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నిలదొక్కుకునేందుకు నేలను తన్ని మరీ ఆకాశంవైపు చూపు సారిస్తూనే ఉంటుంది. అలాగే లక్ష్యసాధకుడు కాలం తన సంకల్పానికి సవాళ్లు విసిరినకొద్దీ స్థిరచిత్తుడై ముందుకు సాగిపోతూనే ఉంటాడు.*

*🌷కాంక్షలు కార్యరూపం దాల్చనప్పుడు కలతపడటం, మనసు చిన్నబుచ్చుకోవడం మనోదౌర్బల్య లక్షణాలు. ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వ్యక్తిలో రెండు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి కూటస్థ బుద్ధి, రెండోది దృఢ దీక్ష. ప్రాపంచిక జీవనంలోనైనా, పారమార్థిక సాధనలోనైనా ఈ సుగుణాలే సంపూర్ణ సత్ఫలితాలనిస్తాయి. కూటస్థం అంటే కమ్మరి దాగలి. కమ్మరి దాగలిలా నిర్వికారంగా ఉండటమే కూటస్థ బుద్ధి. దాగలి మీద ఎన్నో సమ్మెటపోట్లు పడతాయి! అయినా అది ఎలాంటి మార్పు చెందదు. అలాగే పారమార్థికతలో పురోగమిస్తున్న వ్యక్తి ఎన్ని కష్టనష్టాలనైనా నిబ్బరంగా భరిస్తాడు. రెండో లక్షణం దృఢదీక్ష. పెట్టుకున్న లక్ష్యంపై నుంచి దృష్టిని మరల్చని, సాధించేవరకు విశ్రమించని లక్ష్యశుద్ధి అది.*

*🚩వివేకానందుడు "ప్రపంచ సర్వమత సభల్లో" పాల్గొనేందుకు అమెరికా వెళ్లినప్పుడు, పరిస్థితులు ఎర్రతివాచీ పరచి ఏమీ ఆయనను స్వాగతించలేదు. పరాభవాలను, ప్రతికూలతలనూ తట్టుకొని ఆయన ఆత్మవిశ్వాసంతో, పరమాత్మపై విశ్వాసంతో ముందుకు సాగిపోయారు. ఆధ్యాత్మిక ఝంఝామారుతంలా తన ప్రసంగాలతో పాశ్చాత్యులను ప్రకంపింపజేశారు.*

*🕉️మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని, ప్రేమస్వభావాన్ని కాలం ఎన్నటికీ లాగేసుకోలేదు. ఆ లక్షణాలన్నీ కేవలం మనకు మనం పెంపొందించుకోవలసినవి. ఇలా వివిధ వైరుధ్యాల మధ్య మన జీవనయానాన్ని విషాదాంతం చేసుకుంటామా, ప్రమోదాంతంగా మలచుకుంటామా అన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది.*

*💐 పువ్వుకుండే కోమలత్వం, పిడుగుకుండే శక్తి- వీటి సంయోజనమే అసలైన ఆధ్మాత్మిక ప్రయాణికుడి ఆనవాలు. పైగా అతడివి బాహ్యపరిస్థితులపై ఆధారపడని ఆంతరంగిక సుఖశాంతులు. అలాంటివారు కష్టాన్నీ కూడా తమకు ఆ పరమాత్మ పంపిన ప్రసాదంగానే భావిస్తారు. అందుకే ‘క్లేశం తరవాత క్లేశంలో అతడి అడుగులే నా గుండెపైన బరువుగా ఆనేది. నా ఆనందాన్ని ప్రకాశింపజేసేది అతడి చరణాల స్వర్ణస్పర్శే’ అంటారు రవీంద్రనాథ్‌ టాగూర్‌ తమ ‘గీతాంజలి’లో.... వచ్చిన ప్రతి కష్టమూ జీవితానికొక కొత్త కిటికీ తలుపు తెరిచిందనుకునే ఆశావహులు ఎన్నడూ కుంగిపోరు. తమ గది తలుపులు మూసుకొని కకావికలురై కన్నీరు పెట్టుకోరు.*

*😁లోకంలో ఏ ఉత్సాహమూ కనిపించనప్పుడు, మనిషి తనలోంచి ఉత్సాహాన్ని తోడిపొయ్యాలి. ప్రతీ క్షణాన్ని లలితంగా దిద్దుకొని తామరాకుపై నీటిబొట్టులా తళతళలాడాలి. నిజానికి అనివార్యాలను ఆహ్వానిస్తూ, వాటికి మనల్ని మనం అనుకూలపరచుకోవడం అభ్యాసం చేసుకోకపోతే అభ్యుదయంవైపు సాగిపోలేం. సంఘర్షణ, సంక్షోభం జాడలేని జీవితాలే కనిపించవు. అవి మన పురోగమనానికి దీపస్తంభాల్లాంటివి. అవి మనలో నిబిడీకృతమైన శక్తుల్ని మేల్కొలుపుతాయి.*
 
*అంతర్ముఖులమై ఆలోచిస్తే సుఖదుఃఖాల వెలుగునీడల క్రీడే జీవితం. వెలుగును మాత్రమే వాంఛిస్తూ, చీకటిని నిరాకరిస్తే ఆటను ఎలా సంపూర్ణంగా ఆస్వాదించగలం? కీర్తికిరీటాలను ధరించడానికి ఎలా అర్హులమవుతాం..?* 
~~~~~~~~~~~~~~~~
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
 మనసు తలుపు తెరవగానే 
మనను పొదివి పట్టుకుని ప్రేమగా 
లోపలికి తీసుకెళ్లి పరిమళాన్ని
పరిచయం చేసే  పిల్లగాలి

రెప్పల తెర తీయగానే 
చప్పున చేయి పట్టుకుని 
మనకోసం ముంగిట వేచిన 
వెలుగుల ముగ్గులు చూపే కాంతి

దూరంగా అదేపనిగా.....
మనల్నే పిలుస్తూ రారమ్మని 
ఆహ్వానిస్తూ కమ్మగా కూసే 
కోయిల స్వాగత గీతాలు

బయటకు అడుగు పెట్టగానే 
నిలువెల్లా వెచ్చగా తాకి 
నీకోసమే వచ్చానంటూ 
నులివెచ్చని హాయిని ఇచ్చే నీరెండ...

తూరుపు సింహాసనం అధిరోహించి
గగన వీధిని కొలువు చేయగా
జ్యోతి కలశం హేమకాంతులు 
ఒలికిస్తూ ఏతెంచే శుభతరుణం...

సకల చరాచర జీవాలకు 
సత్తువ సేమము ప్రసాదించి
నిఖిల జగమునకు నిరతము
చైతన్య  ప్రదాతగా  రక్షింప 

ఆగమించు దినమణికి 

🌸🌸🌸🌸

బృంద 🙏
 🔻-#బాబోయీ_చలం  " - " #స్త్రీ ✍️🔻
🚩ఈమధ్య మళ్ళి చలం రాసిన " స్త్రీ " పుస్తకం చదివాను,,
చదవడం అయ్యాక " బాబోయ్ చలం " అని అనిపించింది.
చలం నవలలన్నింటిలోనూ స్త్రీ ఒక ప్రేరక శక్తి, శృంగారం మూర్తీభవించిన లోకాతీతమైన వ్యక్తి. ఒక మానసిక శక్తి. ఒకళ్ళు ఆరాధించతగిన వ్యక్తే కానీ, కామించదగ్గది కాదు.
ఆయన స్త్రీలందరూ, జీవితంలో ఏ ఆదర్శం కోసం తను వేదన
చెంది, తపించి విసిగి వేసారి, ఒంటరితనం, బాధ అనుభవించాడో, ఆ ఆదర్శం కోసం అంతే బాధపడి ఆఖరవుతాడు.
🚩స్త్రీ తన సర్వస్వాన్ని పురుషుడు కోసం త్యాగం చేస్తుంది. జీవన పయనంలో తనను ఎన్ని అవమానాలు పాలు చేసినా, ఎంత క్షోభ పెట్టినా భరించే సహన శీలి స్త్రీ.
కానీ ఆ స్త్రీ కోపంతో రగిలిపోతే పురుషుడు కాలిపోతాడు. సంసారమన్నా స్త్రీ పురుష సంబంధమన్నా పరస్పర అవగాహన, సహకారం అవసరం అని ఇద్దరు గ్రహించాలి.
స్త్రీ పురుషుడికి బానిస కాదు. అలాగే పురుషుడు స్త్రీ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండక్కర్లేదు. స్త్రీ స్వేచ్చ చాలా ముఖ్యం. త్రాసు లో సమానంగా తూగగలితే ఆ జంట అత్యంత అన్యోన్యంగా ఉన్నట్లే.👌👍👌
🚩ఆంధ్రలో బ్రహ్మ సమాజం 1864లో ప్రారంభమయింది. 1916 ప్రాంతంలో చలం బ్రహ్మ సమాజంలో చేరాడు (ఆంధ్రలో చలం పే.604). దాదాపు 1920ల వరకు అందులో పనిచేశాడు. బ్రహ్మ సమాజంలో చేరకముందే తన ఇంట్లో ఆడవాళ్ళనీ, పిల్లల్నీ పొట్టి నిక్కర్లేయించి బాడ్మింటన్‌ ఆడటానికి తీసుకెళ్ళడం లాంటి పనులు చేశాడు. ఈనాడవి అంత గొప్ప విషయాలనిపించక పోవచ్చు. కానీ అప్పటి వాళ్ళకవన్నీ విపరీతంగా కనిపించాయనటంలో ఆశ్చర్యం లేదు. వీళ్ళు బజార్ల గుండా వెళ్తుంటే ఎంతో మంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు,ఉమ్ములూసేవారు. అట్లా చలం తన వ్యక్తిగత జీవితంలోనే సమాజాన్నెదిరించి తాను చెప్పింది చేశాడు.
🚩”కుటుంబ జీవితంలోనూ, స్త్రీ విషయంలోనూ, సాంఘిక నీతుల విషయంలోనూ, చాలా సంకుచితంగా, దుర్మార్గంగా ప్రవర్తించేవారినీ, కులమత భావాల్ని వదలని వారినీ, వ్యక్తిగతంగా నిజాయితీ లేని వారినీ, అవకాశవాదులనూ, జాతీయోద్యమంలో ఎక్కువ చూసి ఆ ఉద్యమ రాజకీయాల వల్ల ప్రభావితుడు కాలేకపోయారు . దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్త్రీకి సంపూర్ణ స్వాతంత్య్రం ప్రభుత్వపు కాగితాలలో మాత్రమే ఉండటాన్ని గురించి 52లో రాశాడు చలం. (1952 సంపుటిలో స్త్రీకి రాసిన ముందు మాట ”ఇంకోసారి మళ్ళీ తప్పలేదు” పేజీ 20-25).
🚩”ఆస్తినంతా లాగేస్తూ, ఆస్తి హక్కుని స్త్రీకి ఇచ్చి ఏం లాభం? బతుకంతా బానిసత్వం చేసి, భర్తనుంచి స్వేచ్ఛనిచ్చి ఏం లాభం?” అంటూ ఆస్తి హక్కు, విడాకుల చట్టాలకున్న పరిమితులను బయటపెట్టాడు.
ఇదివరకు భర్తను వదిలి స్త్రీ ఇంకొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకోవచ్చని చట్టం చెప్పగానే ఇంత వరకు ఆ స్త్రీని వ్యభిచారిగా లెక్క గట్టిన సంఘం ఒక్కసారి ఆమెను పతివ్రతనెట్లా చేసిందని ఎద్దేవా చేశాడు. వ్యక్తి జీవితాన్ని సంఘం అదుపు చేయడం చలానికి ఆమోదయోగ్యం కాదు.
🚩ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి,
ఎప్పుడు కనాలనే ప్రశ్నలన్నీ కూడా ”జాతీయం” అయిపోయాయని బాధపడ్డాడు. మనం ఈ రోజు చర్చిస్తున్న సాంఘిక వ్యవస్థ, నీతి, ధర్మాలు, ప్రభుత్వం/రాజ్యం-నీతి, ధర్మాలు – వాటిలో వ్యక్తికున్న స్వేచ్ఛ అనే అంశాలన్నీ స్ఫురిస్తాయనడం అతిశయోక్తి కాదు.
తన స్వంత చెల్లెలు అమ్మణ్ణి విషయంలో తాను పడ్డ బాధ, ఎదుర్కొన్న వైరుధ్యాల గురించి ఆత్మకథలో రాశాడు. తన చెల్లెలి అనుభవమైన మొదలు ”అత్తవారింట స్త్రీ ఏం బాధలు పడుతుందో, ఏ విధంగా వాళ్ళ మెదళ్ళని అత్తవారు ఎలా నడిపించేస్తారో అర్థమయింది. ఆ రోజున స్త్రీ జనరక్షణోద్యమానికి ప్రారంభోత్సవం జరిగింది. స్త్రీ సంస్కరణ అంటే ఏమిటో తెలిసి వచ్చింది నాకు” (ఆత్మకథ పేజీ-23) అంటూ రాశాడు
🚩మగవాళ్ళ లాగానే స్త్రీలూ గొప్ప, మధ్య తరగతి, బీద అనే మూడు వర్గాలనీ మొదటి రెండు వర్గాలూ తమ స్వంత సంపాదనైనా లేకుండా భర్తల మీద ఆధారపడతారనీ, బీద వర్గం స్త్రీకి ఆ సంపాదన ఉన్నా అది భర్త అజమాయిషీలో ఉంటుందనీ, భర్త ఆధీనంలో స్త్రీ శ్రమ, సంపాదన ఉన్నంత వరకూ బీద స్త్రీకైనా స్వతంత్రత లేదనీ వాదించాడు. ఇంటి దగ్గర మగవాళ్ళ అవసరాలు తీరుస్తూ స్త్రీలు వాళ్ళని ప్రపంచంలోకి వెళ్ళే స్వేచ్ఛను కలిగిస్తున్నారన్న మాట ఆనాడే (1924) చలం చెప్పాడు.
🚩పిల్లల్ని కనడం అనే ప్రకృతి సహజమైన అంశం కోసం స్త్రీ తన ఇతర బాధ్యతలు (పని, ఉద్యోగం) వదులుకోవడం కృత్రిమమని అందుకే పిల్లల్ని చూసే కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ కూడా చెప్పాడు. ”బిడ్డలు అఖ్ఖర్లేదనుకుంటే గర్భ నిరోధక సాధనాలు ఉపయోగించడం న్యాయం కాని, గర్భం కలుగుతుందేమోనని భయంతో బతకడం ఘోరం… బిడ్డలు అఖ్ఖర్లేదనుకున్న వాళ్ళకు గర్భం కలిగితే, తగిన డాక్టర్ల చేత అది తీయించుకోవడం ఉత్తమం – కనడం కన్నా” (బిడ్డల శిక్షణ పే.130) అని గర్భనిరోధం, అబార్షన్ల గురించి చట్టవిరుద్ధమని తెలిసే ధైర్యంగా సూచనలిచ్చాడు. ”
స్త్రీ స్థానానికి సంబంధించి మతాన్ని, కులాన్ని, సంప్రదాయాన్ని, సంఘాన్ని అన్నింటినీ తప్పుపట్టాడు చలం. ఆమెని తన స్వంతం చేసుకోవడానికి పురుషుడు ఎట్లా ప్రయత్నిస్తాడో ఎద్దేవా చేశాడు.
🚩ఒక గార్డియన్‌గా రక్షకుడు అనే పేరుతో, నిజానికి సిఐడి ఆఫీసరుగా, పోలీసువాడిగా, మేజిస్ట్రేట్‌గా చివరికి హయ్యస్ట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అపీల్‌గా, జైలరుగా, ఉరి తీసేవాడిగా అన్ని రూపాల్నీ భర్త ఎట్లా ధరిస్తాడని చాలా వ్యంగ్యంగా చెప్పాడు. ఆమె మీద తాను చెలాయించే పెత్తనాలన్నింటినీ వదిలేయాలని (మాన్‌ అండ్‌ ఉమెన్‌) ఆయన చెప్పాడు. ఆ జ్ఞానం ఇప్పటికి మాత్రం ఎంత మందిలో ఉంది? కాలక్రమంలో మారిన పురుషులకి అనుగుణంగా మాత్రమే స్త్రీ కూడా మారుతూ వచ్చిందని చలం చెప్పింది ఈనాటికీ నిజమే.
🚩పూర్వం పురుషుడికి ”పొట్టి చేతుల రవిక, కొప్పూ, అందెలూ, రాగిడీ ఇష్టమైతే ఆ వేషమే వేసింది స్త్రీ. ఇంగ్లీషు విద్య నేర్చిన పురుషుడికి జాకెట్టు, నాగరం, గాజులు, చిన్న బొట్టూ, కొంచెం సంగీతం, ఇంగ్లీషు ముక్కలు ఇష్టమైతే ఆ స్వరూపమే దాల్చింది” (స్త్రీ పేజి-43) అంటూ పెళ్ళయిన మరుక్షణం నుంచే భర్త తన భార్యను తన ఇష్టానుసారంగా ఎట్లా మలచుకుంటాడో చక్కగా రాశాడు. ”ఆమె ఊహలకి తను ఆకారమిస్తాడు. ఆమె అభిరుచులకి తను రంగులేస్తాడు. ఆమె ఏ పుస్తకాలు చదవాలో… అసలు చదవాలో లేదో, ఆమె ఎవరితో మాట్లాడాలో, అసలు మాట్లాడాలో లేదో, ఎట్లా కూచోవాలో, ఎన్ని గంటలకి లేవాలో, పడుకోవాలో ఆజ్ఞాపిస్తాడు. ఆమెకిదివరకే ఉన్న పాత అభిప్రాయాలలో తనకి నచ్చనివి ఉంటే వాటిని వెక్కిరించి, ఏడిపించి వదిలేస్తాడు…” చివరికి అతని మాటలు పలికే చిలుకగా, గ్రామ్‌ఫోన్‌ ప్లేటుగా మారుతుంది. చీర కొనేటప్పుడు కూడా ఆ రంగు అతనికిష్టమేనా, పచ్చడి చేసేటప్పుడు ఆ రుచి అతనికి సయిస్తుందా, ఈ కొత్త ఊహ అతనికి నచ్చుతుందా అని ఆలోచిస్తుంది…”. ఈ విధంగా మలచిన స్త్రీ ఆత్మ ఎలా ఉంటుంది? ”హత్య చేసేవాడు శరీరాన్ని చంపుతాడు. ఈ భర్త ఆత్మని నాశనం చేస్తాడు” అన్నాడు చలం ఆనాడు.
🚩🚩 ఇప్పటికీ ఈ స్థితే కొనసాగుతోంది. పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన పద్ధతీ, వాతావరణం, పొందిన జ్ఞానం, మన పైన సమాజపు పోలీసింగ్‌ పెళ్ళి కాగానే మారిపోతాయి. ఇంటి పేరుతో సహా ఎగిరిపోతాయి. మనకున్న వ్యక్తిత్వాన్ని, ఉనికినీ, గతాన్ని భార్యలుగా, తల్లులుగా కావటానికి ప్రోత్సహించే పరిస్థితులు ఊపిరాడనివ్వవు.
🚩🚩ఇవే అంశాలను తన రచనలలో ప్రధానంగా తీసుకున్న చలాన్ని అర్థం చేసుకోవడానికి విశ్లేషణ చాలా అవసరమని తిరిగి చెప్పాల్సిన అవసరం ఉండదు.
    
       🌹సేకరణ 🌹
 🔔 *శివోహం* 🔔

*సాధారణంగా కైలాస శిఖరాన్ని ప్రదక్షిణ చేయడమనేది చాలా గొప్ప విషయం...*

*సుమారు 6000 అడుగుల ఎత్తులో, ఆ చలి గాలులలో, కైలాస శిఖరం చుట్టూ ఉన్న 53 km ప్రదక్షిణ చేసి వచ్చేందుకు, 3 రోజులు పడుతుంది...*

*కానీ, టిబెట్టు దేశస్థులు చేసే ప్రదక్షిణని, మనం కలలో కూడా ఊహించలేము...*

*ఆడ, మగ తేడా లేకుండా, అడుగుకి ఒక సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఆ 53 km ను తిరిగి వస్తారట. సుమారు, 2, 3 వారాలు జరుగుతుంది వారి ఆ ప్రయాణం... ఇలా చేస్తే, పునర్జన్మ ఉండదని వారి నమ్మకమట.*

*ఇలా చేసేందుకు కావలసిన మనోధైర్యం, ఆరోగ్యం, ప్రాణబలం, వైరాగ్యం ఉండాలి.*

*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁
 *యోగము అంటే కలయిక.....*

*కలయిక అంటే? జీవుడు దైవాన్ని చేరుకోవడం*

*జీవుడు ఆత్మలో విలీనం కావడం భృమధ్య స్థానంలో కర్మ ద్వారా దైవాన్ని చేరొచ్చు భక్తి ద్వారా దైవాన్ని చేరొచ్చు జ్ఞానం ద్వారా దైవాన్ని చేరవచ్చు*

*భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు.* 

*వీటిలో 1 నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు.* 

*7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని అంటారు.*

*13 నుండి 18 వరకు "జ్ఞాన షట్కము".అని అంటారు.*

*ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు:*

*7.జ్ఞానవిజ్ఞాన యోగము:*
*విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం. ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గూర్చిన జ్ఞానం, ఆయన స్వరూపము, మాయ, సర్వాంతర్యామిత్వం పరిచయం చేయబడినాయి. ఆయనకు శరణుజొచ్చుట మాత్రమే సరయిన భక్తిమార్గం. వారికే ఆయన కరుణ లభిస్తుంది. వేలాదిలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై* *ప్రయత్నిస్తాడు. వారిలో ఏఒక్కడో భగవంతుని తెలుసుకోగలుగుతాడు.*

*భగవంతుని ప్రకృతి (మాయ) మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు అనే ఎనిమిది తత్వాలుగా విభజింపబడింది. ఇది అపరా ప్రకృతి. ఇంతకంటె ఉత్తమమైనది పరాప్రకృతి భగవంతుని చైతన్యము. ఈ రెండింటి సంయోగం వలన సృష్టి జరుగుతుంది. మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించియున్నాడు. భగవంతుకంటె వేరుగా ఏదీ లేదు.*

*ఆర్తులు, అర్ధార్ధులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు. వారిలో జ్ఞాని సర్వమూ వాసుదేవమయమని తెలుసుకొని కొలుస్తృఆడు గనుక అతడు భగవంతునికి ప్రియతముడు. అనేక దేవతల రూపాలలో భగవంతుని ఆరాధించే భక్తులను ఆయా దేవతలస్వరూపంలో వాసుదేవుడు అనుగ్రహిస్తాడు. దేవతలనారాధించేవారు దేవతలను, సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు. జన్న జరా మరణాలనుండి మోక్షాన్ని పొందగోరినవారు దేవదేవుని (వాసుదేవుని) ఆశ్రయించి, సమస్తమూ ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు.*

*8.అక్షరపరబ్రహ్మ యోగము:*
*బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది. నిత్యమైన, సత్యమైన పరమ పదము, పరబ్రహ్మము గూర్చి చెప్పబడినది.*

*క్షరము అనగా నశించునది. నాశరహితమైన పరబ్రహ్మమే అక్షరము. జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్యమ విద్య. అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దే్హాన్ని త్యజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకొంటాడు. ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ దేహాన్ని విడచేవాడు పరమపదాన్ని పొందుతాడు. అన్య చింతన లేకుండా నిశ్చల మనస్సుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమౌతుంది. అలా భగవంతుని పొందినవానికి పునర్జన్మ లేదు. బ్రహ్మ చేసిన సృష్టి మరల బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది. సమస్తమూ నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానం శ్రీకృష్ణుని ఆవాసం. అక్కడికి చేరినవారికి తిరిగి వెళ్ళడం ఉండదు. అనన్య భక్తి చేతనే ఆ దివ్యపదాన్ని చేరుకోగలరు.*

*9.రాజవిద్యారాజగుహ్య యోగము:*
*కర్మ యోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, జ్ఞాన విజ్ఞాన యోగములలో జీవన విధానానికి మార్గం, భగవత్ప్రాప్తికి సాధనం నిర్దేశించబడినాయి. అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయం జరిగింది. 9న అధ్యాయం అయిన "రాజవిద్యా రాజగుహ్య యోగము" కృష్ణుడు తానే భగంతుడనని, సృష్టి స్థితి లయ కారకుడనని తెలిపాడు. ఇది పవిత్రమైన జ్ఞానము. అన్నింటా విస్తరించిన పరమాత్ముని గురించి, ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది. కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం -*

*" విద్యలలో ఉత్తమమైనది, అతి నిగూఢమయినది ఈ బ్రహ్మ విద్య. జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది. అర్జునా! నా అధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది, కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టింపబడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మ ఫల ప్రదాతను. ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. సర్వాన్నీ భరించేవాడిని, ఆశ్రయాన్ని, బీజాన్ని, శరణునొసగేవాడిని, సాక్షిని, సృష్టి స్థితి లయ కారకుడను, సత్‌స్వరూపుడను, అమృతుడను. మూఢులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్ధమైన ఆశలతోను, నిష్ప్రయోజనమైన కర్మలతోను నశిస్తున్నారు. సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ జహఞానయోగం ద్వారా ఆరాధిస్తారు. అనన్య చింతనతో నన్ను ఉపాసించేవారి యోగ క్షేమాలు నేనే వహిస్తాను."*

*"అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు. నేనొసగే కామ్యార్ధాలను ఆయా దేవతల ద్వారా పొదుతున్నారు. నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు. పవిత్రమైన హృదయంతో నాకు పత్రము, పుష్పము, ఫలము, జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడనౌతాను. ఏ పని చేసినా ఆ కర్మ ఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మ బంధంనుండి విముక్తుడవౌతావు. నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడైనా అతడెన్నటికీ నశింపడు. ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమగతిని పొందుతారు. కనుక నాయందే మనసు లగ్నం చేసి, నా భక్తుడవై, నన్నారాధించుము. నన్నే శరణు జొచ్చుము. నన్నే నీవు పొందెదదవు"*

*10. విభూతి యోగము:*
*ఇంతకు ముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందడానికి అవుసరమైన సాధన చెప్పబడింది. తరువాత అక్షరమైన పరబ్రహ్మమంటే ఏమిటో, ఎవరో, ఆ పరబ్రహ్మను పొందడానికి ఏమి చేయాలో కృష్ణుడు చెప్పాడు. ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మము ఏయే రూపములలో గోచరిస్తుందో తెలిపాడు. సకల చరాచరమలలో, లోకములలో, యుగములలో వ్యాపించియున్న తన అనంతమైన విభూతులలో కొద్ది విభూతులను భగవానుడు అర్జునునకు తెలియజెప్పెను.*

*" నేను సమస్త మానవుల హృదయాలలో ఆసీనుడనై యున్నాను. సమస్తమునకు ఆది, మధ్య, అంతము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము లేవు.. ఆదిత్యులలో విష్ణువును. తేజోమయమైనవానిలో సూర్యుడను. గోవులలో కామధేనువును. దైత్యులలో ప్రహ్లాదుడను. ఆయుధ ధారులలో రాముడను. నదులలో గంగ. స్త్రీలలో కీర్తి, మేధ, క్షమ. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. వృష్ణులలో వాసుదేవుడను. విజయులలో జిగీషను. మోసగాళ్ళలో ద్యూతాన్ని. జలచరాలలో మొసలిని. జలరాశులలో సముద్రాన్ని. వేయేల? ఐశ్వర్యమయము, కాంతిమయము, శక్తి మయము ఐనవన్నియు నా తేజస్సులో ఒక అంశనుండి కలిగినవి. సప్తర్షులు, సనకసనందనాదులు, మనువులు నా మానసమునుండే ఉద్భవించారు. జ్ఞానులు నా దివ్య విభూతులను తెలిసికొన్నవారై, నాయందే మగ్నులై, పరస్పరం నాగురించి ఒకరికొకరు బోధించుకొంటూ ఆనందిస్తుంటారు." - అని తన విభూతులను గురించి తానే ఇలా చెప్పాడు భగవంతుడైన వాసుదేవుడు.*

*11. విశ్వరూపసందర్శన యోగము:*
*శ్రీకృష్ణుడు విశ్వరూపములలో భగవానుని దివ్యగుణ వైభవాలను గురించి విన్న అర్జునుడు భగవానుని షడ్గుణైశ్వర్య సంపన్నమైన తేజోరూపమును చూపమని ప్రార్ధించెను. సామాన్య చక్షువులతో ఆ రూపం చూడడం దుర్లభం గనుక కృష్ణుడు అర్జుననకు దివ్యదృష్టిని ప్రసాదించెను. అపుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు, నేత్రములు, అద్భుతాయుధములు ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని విశ్వరూపమును దర్శించెను. అది దివ్యమాల్యాంబర ధరము, దివ్య గంధానులేపనము. ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందెవ్వరును చూడలేదు. అర్జునుడు పులకించి ఆ అనంతరూపుని ఇలా ప్రస్తుతించాడు.*

*"దేవదేవా! జగత్పతే! అనంతరూపా! సూర్యునివలె ప్రజ్వలించుచున్న నీ అనంత రూపము చూడ నాకు శక్యము గాకున్నది. నీవు దేవదేవుడవు, సనాతనుడవు. అనంత శక్తి సంపన్నుడవు. నీయందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు. దేవతు, మహర్షులు, పితరులు నిన్ను స్తుతిస్తున్నారు. ప్రభో! నీకు అనేక నమస్కారములు. మరల మరల నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము" అని ప్రార్ధించాడు.*

*అర్జునుని కరుణించి భగవానుడు తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించడం తపస్సు వలన కాని, వేదాధ్యయనం వలన గాని అలవి కాదని చెప్పాడు. అనన్యమైన భక్తి వలన మాత్రమే ఆ దివ్యరూపాన్ని తెలుసుకోవడం సాధ్యమని తెలిపాడు.*

*12. భక్తి యోగము:*
*పరమాత్ముని సగుణ, నిర్గుణ రూపములలో దేనిని ఆరాధింపవలెనని అర్జునుడు ప్రశ్నించెను. రెండును భగవానుని చేరు మార్గములే అయినను సగుణ సాకార ఉపాసనయే భక్తులకు అనువైన మార్గమని సెలవిచ్చెను. ఆపై భగవంతుడు జ్ఞానియైన తన భక్తుల లక్షణములను వివరించెను. భగవంతుని యెడల అత్యంత ప్రేమ కలిగి ఉండడం భక్తి అనబడుతుంది. ఉత్తమ భక్తుడు ఇంద్రియ నిగ్రహము, సమ భావము, సర్వ భూత హితాభిలాష కలిగి ఉండాలి. ఏ ప్రాణినీ ద్వేషింపక అన్ని జీవులపట్ల మైత్రి, కరుణ కలిగి ఉండాలి. అహంకార మమకారాలను విడచిపెట్టాలి. ఓర్పు, సంతుష్టి, నిశ్చల చిత్తము కలిగి ఉండాలి. శుచి, శ్రద్ధ, కార్య దక్షత కలిగి ఉండాలి. మనోబుద్ధులను భగవంతునికి అర్పించాలి.*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🌹🍁 🙏🕉️🙏 🍁🌹🍁
 🌳 *వటసావిత్రీ వ్రతం* 🌳

*వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించాలి వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి.*

*జ్యేష్ట శుద్ధ పూర్ణిమ :*
*దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ రోజు భూదేవిని పూజించడం మంచిది.*

*వట సావిత్రీ వ్రతము :*
*హైందవ సంస్కృతి లో, ఆధ్యాత్మిక జీవన విధానములో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము, కట్టుకున్న భర్త, బిడ్డలకోసం.* *పురుషులకంటే స్త్రీలే ఎక్కువగా ధైవారాధనలో నిమగ్నులైవుంటారు. ధర్మార్ధ, కామ, మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో "వట సావిత్రీ వ్రతము" ఒకటి ముఖ్యమైనది.*

*తన పాతివ్రత మహిమతో యమధరమరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ, దాన భేద, దండోపాయాలను అవలంబించాలని యమధరమరాజు ప్రయత్నించినా ప్రతివ్రతామతల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు.*

*సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రీ వ్రతం నాడు కొత్త దుస్తులు ధరంచి, చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సిందూరంతో వటవృక్షాన్ని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకట్టి, చెట్టుచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రిచెట్టు... ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భవిస్తారు. మర్రిచెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాలైన ఈ వ్రతాచరణలో* *నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాసదీక్షలంటే ప్రాణం లేచివచ్చినట్లుండేది. మర్రివృక్షం లా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రీ వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు.*

*పసువు కుంకుమలతో పూజిస్తారు, ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన, విస్తారమైన ఈ వృక్షం కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్ధిస్తారు. కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్దాలను నైవేద్యముగా పెడతారు. బందు మిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. భాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి, నూతన వస్త్రాలను ధరించి, శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రిచెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రున్ని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు. కొందరు ఒక పూట భోజనం చేస్తారు. మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రీ వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు.  నేపాల్ లోను, మనదేశంలొని బీహార్లో ఈ వటసావిత్రీ వ్రతాన్ని 500 ఏళ్ళుగా ఆచరిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన "మిథిల"లో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు అధారాలు ఉన్నాయట.*

*వ్రత విధానం...*
*వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్ల వారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం.*

*"బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం*
*సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ*
*వట సావిత్రీ వ్రతం కరిష్యే’’*
*అనే శ్లోకాన్ని పఠించాలి.*

*┈┉━❀꧁మాత్రేనమః꧂❀━┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🌳🍁 🙏🕉️🙏 🍁🌳🍁

Monday, 9 June 2025

 *సహజీవన విధానం కరెక్టేనా ?*

Is co-living / living together, an immoral concept ?

Does it destroy family concept ?

Does it increase selfishness ? 

కలిసివుందాం, 
కలిసితిందాం, 
కలిసి వండుకుందాం,
కలిసి పండుకుందాం,
శారీరకంగా కలుద్దాం,
వద్దనుకుంటే విడిపోదాం,
మళ్ళీ వేరే వారితో జోడీ కడదాం?
ఎవరి ఆస్తులు, సంపాదన వారివే, 
ఎవరి ఖర్చులు వారివే,
పొరపాటున పిల్లలు పుడితే, ఫలానా, ఫలానా, నిష్పత్తిలో పెంచుకుందాం,
విడిపోవడానికి కోర్టుల కెళ్లే పని లేదు, 
ఆస్తుల పంపకం సమస్యలు లేవు,
ఈ రోజు నేనూ నువ్వూ,
రేపు నేనూ ఇంకెవరో...
కావాలనుకుంటే కలిసుంటాం,
వద్దనుకుంటే విడిపోతాం,
మళ్ళీ వేరొకరితో కొత్తగా మొదలెడతాం... 
పెళ్లి ఎందుకు దండగ,
స్వేచ్ఛ గా వుండక.

ఈ వ్యవహారం, ఈ నాటి తరం లో విస్తృతంగా వ్యాపిస్తున్నది. 

జంతువుల్లాగా స్వేచ్ఛ గా జత కట్టడం, కలవడం, విడిపోవడం. 

బంధాలు లేవు,
బాధ్యతలు లేవు,
కుటుంబం లేదు,
అమ్మ, నాన్న, అత్త, మామ, అఖ్ఖర్లేదు. 
ఉన్నామా, సంపాదించామా, తిన్నామా, 
పక్కెక్కామా, 
తెల్లారిందా... 
ఇదీ కాన్సెప్ట్. 

ఇది జంతువుల జీవన విధానం కాదా? 
ఆలోచించండి.
ఇందులో నియమాలకు కట్టుబడి జీవించే, నాగరిక జీవన విధానం ఎక్కడున్నది? 

కొంతకాలం ఒకరి తో సహజీవనం 
నచ్చక పోతే మరొకరితో సహజీవనం,

ఆ తర్వాత ఎప్పుడో, ఎందుకో ఎవరి తోనో పెళ్లి,
కొంత కాలానికి విడాకులు,
మళ్ళీ సహజీవనం, లేకపోతే మళ్ళీ పెళ్లి. 

మధ్యలో నలిగి పోయేది వారిని కన్న తల్లితండ్రులూ, వారు కన్న పిల్లలూ. 

వారు ప్రొడ్యూస్ చేసి వదిలేసిన పిల్లల్ని పెంచే చాకిరీ, అమ్మమ్మలదీ, నానమ్మలదీ. 

ఎంత సంపద పోగు చేసుకున్నాం ,  
ఎంత విలాసవంతంగా జీవించాం,
ఎన్ని సుఖ్హాలు అనుభవించాం, 
అన్నదే వారికి ముఖ్యం.
ఎంత సంస్కారవంతంగా జీవించామన్నది, వారికి, అసలు ప్రశ్నే కాదు.

ఈ నాటి తరం లో విస్తరిస్తున్న, ఈ విధమైన విశృంఖల ధోరణి , ఆరోగ్యకరమైనదేనా?  

నియమబద్ధమైన నడవడిక, 
కుటుంబ మమతానుబంధాలు లేని , జంతు జీవనం, జీవితాంతం సంతోషాన్ని ఇస్తుందా? 

 *Think it over* 

■ గాంధీ మందడి 
9441093908
Sociology political analyst.
 [6/8, 21:52] +91 79819 72004: *క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ…!*
                
```
ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. 

ఒకడు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. 
అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. 
ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. 

ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. 

ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. 

స్త్రీ జన్మ ఎత్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. 

ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. 

‘పునరపి జననం పునరపి మరణం’ అనగా మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్లీ మళ్ళీ మరణించడం. 

పుణ్య కర్మల వల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దుఃఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. 

అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం    అక్కడక్కడ చూస్తుంటాం. పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడూ పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండడు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం.```

*‘పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ,’*
*‘పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ’* ```అంటారు. 

అంటే పూర్వ జన్మలో చేసిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. 

ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. 

ఒకడు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. 

ఒకడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. 
ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

పురాణేతిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది….  అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. 

గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 
3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. 

కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుండేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. 

మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పందనలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల బాధలు జనిస్తాయి. 

ఈరకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది. 

క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. 

పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి  క్రిమి కీటకాదులుగా పుట్టడం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం. 

కర్మ వల్లనే పుట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. 

కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. 

మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. 

దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి. 

అసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్తుంటాయి. 

ఒక జన్మలో ఒకరు ఒక విషయంలో పొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.
```

**అసురీ గుణాలు:*```

*కామం…
అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.

*క్రోధం…
క్రోధం అంటే కోపం. దీని వల్ల మనిషి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి, పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది.

*లోభం…
లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.

*మోహం…
మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి.

*మదం…
ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, యవ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.
మాత్సర్యం…
ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.

*రాగము…
ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.

*ద్వేషం…
ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.

*ఈర్ష్య…
తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.

*అసూయ…
తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.

*దంభము…
తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.

*దర్పం…
నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి (అదే గర్వం)

*అహంకారం…
అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణం గల చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు.


ఆసురీ గుణాల్ని తొలగించేందుకు ‘సాధన’ చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. ‘సాధన’లకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్ర ఆదేశానుసారం కర్మ చేయాలి.✍️
```

*మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా?*
```
‘పునర్జన్మ అనేది వున్నది’  అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగఱ్ఱ. 

సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. 

పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. 

పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. 

శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. 

శరీరం లేకపోతే పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదా పోవడం!

గతజన్మలో ఏదో పుణ్యం చేశాను,
ఈ జన్మలో సుఖపడాలి. 

ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. 

ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. 
వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు, కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో!

కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. 

కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం.

ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. 

ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. 

ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి ఉదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను” అన్నారు. 

ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి “నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు.” అన్నది. 

ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి యేమి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏ.సి. వి

మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి ‘అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు’ అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. 

ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. 
కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.

మోక్షం కలగడానికి భక్తితో    అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. 

ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు.                                      నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. 

పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. 
పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. 
నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది. 
ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.

బుద్ధుడు తిరిగి రాని  విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు.

మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.

*త్రికరణములు: 
3.పనిముట్లు 
1. మనస్సు,  2. వాక్కు , 3. శరీరం, వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. 

ఇవి 2 రకాలు.
1. బైటికి కనిపించేవి. 
2. కనిపించనివి. వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు. 

ఇవి మళ్లీ 2 రకాలు. 
పుణ్యకర్మలు. పాపకర్మలు. పుణ్యకర్మలవల్ల సుఖం, పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. 

కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం సూక్ష్మ శరీరం గా (మనోబుద్ధిచిత్యహంకారములు)
ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.

బాల్యం లో జరిగిన వాటిని ముసలితనం లో చెప్పడం,
కొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటివన్నీ ఈ వాసనలే.

కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యం కాదు! 
కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం. 

కర్మను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి. 

స్థూలంగా కర్మ, అకర్మ, వికర్మలను గురించి తెలుసుకుందాం…

1. కర్మ: శాస్త్రవిహితమైనవే
అంటే శాస్త్రము బోధించే కర్మలు. 

2. అకర్మ: ఫలితం కోరకుండా అంటే అహంకార మమకారాలను వదలి చేసే పని. కర్తగా భోక్త గా ఏవిధమైన
సంబంధం లేకుండా చేసే కర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు. 

3. వికర్మ: శాస్త్రము నిషేధించిన కర్మలు. పాప కర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిద్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది.

మరొక విధంగా కర్మ 3 రకాలు. 
1. సంచిత, 2. ప్రారబ్ధ, 3. ఆగామి.

1. సంచితకర్మ: ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం.
2. ప్రారబ్ధం : సంచితకర్మ లో కొంత భాగాన్ని అనుభవించడం.
3. ఆగామి : ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం. 

మన ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే. అందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిద్ధిస్తుంది.
కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు. 

అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు. 

కర్మ సిద్ధాంతము: మూడవ భాగము క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిదాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు.
కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా. 
దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు! అట్లే చెట్టు కు కారణం విత్తు!! అట్లే తండ్రి కారణం కొడుకు.  మళ్ళీ ఆ కొడుకు తన కొడుకుకు కారణం అన్నమాట …

అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చందాల్సిందే దీన్ని కాదనడాన్ని“కృతవిప్రనాశము” అనే దోషము గా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట. పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి. అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పదని పేర్కొన్నారు.ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుంది. అందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినాడు.✍️.```
.
[6/8, 21:52] +91 79819 72004: 🌺Cont…👇
```
ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. 
కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.

మోక్షం కలగడానికి భక్తితో    అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. 

ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు.                                      నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. 

పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. 
పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. 
నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది. 
ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.

బుద్ధుడు తిరిగి రాని  విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు.

మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.

*త్రికరణములు: 
3.పనిముట్లు 
1. మనస్సు,  2. వాక్కు , 3. శరీరం, వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. 

ఇవి 2 రకాలు.
1. బైటికి కనిపించేవి. 
2. కనిపించనివి. వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు. 

ఇవి మళ్లీ 2 రకాలు. 
పుణ్యకర్మలు. పాపకర్మలు. పుణ్యకర్మలవల్ల సుఖం, పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. 

కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం సూక్ష్మ శరీరం గా (మనోబుద్ధిచిత్యహంకారములు)
ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.

బాల్యం లో జరిగిన వాటిని ముసలితనం లో చెప్పడం,
కొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటివన్నీ ఈ వాసనలే.

కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యం కాదు! 
కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం. 

కర్మను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి. 

స్థూలంగా కర్మ, అకర్మ, వికర్మలను గురించి తెలుసుకుందాం…

1. కర్మ: శాస్త్రవిహితమైనవే
అంటే శాస్త్రము బోధించే కర్మలు. 

2. అకర్మ: ఫలితం కోరకుండా అంటే అహంకార మమకారాలను వదలి చేసే పని. కర్తగా భోక్త గా ఏవిధమైన
సంబంధం లేకుండా చేసే కర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు. 

3. వికర్మ: శాస్త్రము నిషేధించిన కర్మలు. పాప కర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిద్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది.

మరొక విధంగా కర్మ 3 రకాలు. 
1. సంచిత, 2. ప్రారబ్ధ, 3. ఆగామి.

1. సంచితకర్మ: ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం.
2. ప్రారబ్ధం : సంచితకర్మ లో కొంత భాగాన్ని అనుభవించడం.
3. ఆగామి : ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం. 

మన ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే. అందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిద్ధిస్తుంది.
కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు. 

అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు. 

కర్మ సిద్ధాంతము: మూడవ భాగము క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిదాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు.
కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా. 
దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు! అట్లే చెట్టు కు కారణం విత్తు!! అట్లే తండ్రి కారణం కొడుకు.  మళ్ళీ ఆ కొడుకు తన కొడుకుకు కారణం అన్నమాట …

అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చందాల్సిందే దీన్ని కాదనడాన్ని“కృతవిప్రనాశము” అనే దోషము గా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట. పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి. అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పదని పేర్కొన్నారు.ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుంది. అందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినాడు.✍️.```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 *ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి     …………..… వరాలెందుకిచ్చాడు?*
               
```
భయపడి వరాలిచ్చాడు. 
ఎవరికి భయపడ్డాడు?
ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి..!

ఎవరువారు?

1.గాంధారి.
2.ద్రౌపది.
3.కుంతి.

ఎందుకు భయపడ్డాడు? 

⚜గాంధారి:- 
ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. 
తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.
ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.

జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తన కొడుకులు నీచ ప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. 

తార్కాణం:- 
యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు. అపుడామె ’జయోస్తు’ అని దీవించలేదు, 
‘యతో ధర్మస్తతో జయః’ ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. 
అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! 
తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే ‘జయోస్తు’ అనే దీవించేది. 

మరో మాట కూడా..! 
యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, ‘నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవించావ కొడకా’ అని ఏడ్చింది. 

ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. 
గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడుకి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు.   

⚜ద్రౌపది:- 
ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో ‘నేను దాసినా?’ అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.

‘భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా?’ అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!…. ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. 
ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు, భయపడ్డాడు. 

⚜ కుంతి:- 
ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, ‘కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా?’ అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు.

👉 ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది 
జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి ‘నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివ’ని పొగిడేడు. 
ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ‘ధర్మరాజు దాస్య విముక్తి’ అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు ‘మిగిలిన భర్తల దాస్య విముక్తి’ అడిగింది. 
ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు.

👉ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి. 
అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడు అయింది. ✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*నూతన గృహానికి గృహప్రవేశానికి పాలు ఎందుకు పొంగిస్తారో వివరాలు తెలుసుకుందాం.*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*ఇల్లు అనేది ఒక కుటుంబం, ఒక వంశం సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో, ఉండటానికి ఏర్పరచుకున్న ఒక నివాసం ఇవన్నీ ప్రస్ఫుటంగా కనబడేది పాలలోనే.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*లక్ష్మీదేవి పుట్టింది పాలసముద్రంలో అలాగే లక్ష్మినారాయణుల నిలయమైన పాల సముద్రంలో సహజీవనం సామరస్యం, సంతోషం సుహృద్భావం వంటి తరంగాలు ఉంటాయి.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*మన ఇంట్లో పాలు పొంగితే పాలతో సరదాలు, సిరిసంపదలు, ప్రేమాభిమానాలు పొంగాలని వాటితోనే శ్రీ లక్ష్మీ నారాయణులు మన ఇంట కొలువుఉండాలని పవిత్రమైన ఆకాంక్షతో గృహప్రవేశ సమయంలో పాలు పొంగిస్తారు.*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
 "నీవు లేక నేను లేను..."

"ఏవండీ, నేనో మాట అడుగుతాను, ఏమీ అనుకోకుండా, సమాధానం చెప్పాలి..."

"మళ్ళీ ఏదో భేతాళ ప్రశ్న వేసేట్టున్నావే...
 సరే, నాకు కొత్త కాదుగా...రానీ..."

"ఏమీ లేదు, మన పిల్లలా...సప్తసముద్రాల అవతల,
ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు, మనిద్దరమే ఇక్కడ
వృద్ధ దంపతులం ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, లోటు లేకుండా సొంతింట్లో పడి, కాలక్షేపం చేసేస్తున్నాం..."

"అయితే...?"

"మనకా, రాను రాను ఓపికలు తగ్గుతున్నాయి, పూర్వకాలంలో వాళ్ళలాగ, పిల్లల దగ్గిర ఉండలేము, వాళ్ళూ ఇక్కడికి రాలేరు, ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినా, ఆరు నెల్లవగానే ఇక్కడికొచ్చేయాలి... 

ఇలా అంటున్నానని, బాధపడొద్దు...ఒకవేళ నాకు
ఏమైనా అయితే, మీరు ఒంటరిగా ఎలా బతగ్గలరా 
అని నాకు బెంగ ! రోజూ పడుకున్నా, ఇలాంటి
ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టి చావట్లేదు ! 
వెధవ కలలు కూడా, అలాంటివే వస్తున్నాయ్...
ఈమధ్య !"

"అలాగా ? నాక్కూడా అలాంటి బెంగలే పట్టుకుంటున్నాయ్...

నువ్వు పైకి తేలావు - నేను తేలట్లేదు...అంతే తేడా !
ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే, మీ ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్లు అడ్డొచ్చేస్తాయి ! ఎలాగూ ఆ టాపిక్ 
నువ్వే తెచ్చావు కాబట్టి, ఓసారి నా మనసులోమాట చెప్పేస్తాను, నేను చెప్పేదానికి అడ్డు రాకుండా, 
శ్రద్ధగా విను...

నీకంటే నేను  పెద్ద, పైగా,  సాధారణంగా 
మగాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, నాకేమైనా అయితే, నీ పరిస్థితి ఏంటి ?"

"అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి, 
శుక్రవారం పూటా..."

"అదిగో మళ్ళీ...సెంటిమెంట్లు తేవద్దన్నానా? 
పూర్తిగా విను ! నువ్వు వెళ్ళిపోయినా, 
నేను వెళ్ళిపోయినా, లోకం ఏమీ ఆగిపోదు !
కాకపోతే, ఇన్నాళ్ళూ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా,
కలిసి బతికి, మన ఇద్దరు పిల్లల్నీ పెంచి పెద్దచేసి,
బాగా చదివించి, ఒకింటివాళ్ళని చేసి, సంతోషంగా విదేశాలకు పంపించాం. వాళ్ళు, వాళ్ళ పిల్లలు - సంసారాలతో చాలా ఆనందంగా వృద్ధిలోకొస్తున్నారు...

నా పెన్షన్ డబ్బుల తోటి, బ్యాంకు  వారిచ్చిన 
ఆరోగ్య బీమాతోటి, ఇంతకాలం బాగానే బతికేస్తున్నాం..."

 "దేవుడు ఎప్పటికీ మన్నిలాగే రక్షిస్తాడు..."

"రక్షిస్తున్నాడు కనుకనే, ఇలా  ఏళ్ళు నిండినా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం ! 
అసలు సంగతి చెబుతాను, విను...

నీకు ఎన్నిసార్లు నేర్పినా, మన సందు చివరున్న
ఏటీఎం కి వెళ్ళి, డబ్బులు తేగలవా ?
అత్యవసరమైతే, చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి 
క్యాబ్ బుక్ చెయ్యగలవా ?
ఎన్నిసార్లు చెప్పినా, నీ బుర్రలోకి వెళ్ళిందా ?
ప్రాణాపాయ స్థితిలో, అంబులెన్స్ బుక్ చెయ్యగలవా ? 
నన్ను హాస్పిటల్ దాకా తీసికెళ్ళగలవా ?
ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడుందో, ఎప్పుడైనా పట్టించుకున్నావా ? దాన్ని ఎలా వాడాలో తెలుసా ?

నీ మనవలతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా, 
'మీరు అన్నీ నేర్చేసుకోండి, వంట, ఈత, కారు డ్రైవింగు, కరాటే, డాన్సు, సంగీతం, అన్నీ వచ్చెయ్యాలి' అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటావు కానీ, నువ్వు, ఇక్కడ, నీకు అవసరమైన కనీస విషయాలు నేర్చుకుంటున్నావా? 

భగవద్గీత రోజూ చదువుతుంటావే...
అందులో దేవుడు ఏం చెప్పాడో, అవన్నీ వంటబట్టించుకుంటున్నావా ?

అసలు నాకెంత పెన్షన్ వస్తుందో చెప్పు చూద్దాం...
ప్రతి నెలా మనకెంత ఖర్చవుతుందో తెలుసా, నీకు ?
మన ఇంటికి ఎంత టాక్స్ కడుతున్నాం ? ఎంతసేపూ
నీ చీరలు, నగలు, ఇంట్లో వున్న గిన్నెలు, తప్పేళాలూ జాగ్రత్తగా చూసుకుంటావుగానీ...
ఇంట్లో గ్యాస్ అయిపోతే, బుక్ చేయగలవా ? 
కరెంట్ బిల్లు ఎక్కడ కట్టాలో, ఎలా కట్టాలో తెలుసా ?
నీ ఫోన్ నువ్వు రీఛార్జ్ చేసుకోగలవా?
మనకి, ఏ బ్యాంకులో, ఎన్ని డిపాజిట్లు ఉన్నాయో, 
ఆ రసీదులు ఎక్కడున్నాయో పట్టించుకున్నావా ?
నీ పేరున వున్న బ్యాంకు అకౌంటు తాలూకు 
నెట్ బ్యాంకింగ్ ని, ఎలా ఆపరేట్ చెయ్యాలో,
కనీసం, దాని పాస్ వర్డ్ ఏమిటో గుర్తుంచుకుంటావా ?
నేను రాసిన వీలునామా ఎక్కడుందో గుర్తుందా ?
అన్నీ నేనే చూడాలా ? నేను నీకు గుమాస్తానా ?"

"మీరు చాలాసార్లు చెప్పారు కానీ...
నాకు బుర్రలోకి వెళ్ళవు ! హాయిగా, అండగా, 
మా ఆయనుండగా, ఆ గొడవలన్నీ నాకెందుకు, దండగ !"

"అక్కడే వచ్చింది, నీలాంటి వాళ్ళతో చిక్కు !
నువ్వు ఆ రోజుల్లో ఇంటర్ పాసయ్యావు కానీ,
లోకజ్ఞానం మాత్రం నీకఖ్ఖర్లేదు ! పోనీ, నేను చెబుతుంటే...నన్ను, నా మాటల్ని పట్టించుకోకుండా,
ఏదో ఒకటి చెప్పి, అక్కణ్ణించి జారుకుంటావ్...
ఈసారి నుంచీ, రాత్తిళ్ళు పడుకోబోయే ముందు,
నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతాను అని కాకుండా, నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతకాలో ఆలోచించు !"

"బాబోయ్, ఇలాంటివన్నీ నాతో అనకండి, 
తల్చుకుంటేనే భయం వేస్తోంది ! 
దేవుడా, నన్నే ముందర తీసికెళ్ళిపో..."

"ఆయన మనం చెప్పినట్టు వినడు, ఆయన చేసేవన్నీ మనమే వినమ్రంగా స్వీకరించి, మనోధైర్యంతో,
ఆయన ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ, 
మన శేషజీవితాల్ని ప్రశాంతంగా లాగించెయ్యాలి...
అర్థమైందా, తెలిసిందా, బోధపడిందా ?"

"బాబోయ్, ఎరక్కపోయి మీతో ఏదో మనసులో 
మాట చెబితే, మీదంతా రివర్స్ హేమరింగు !
మనసంతా పాడైపోయింది...కాసేపు దేవుడి పుస్తకాలు చదువుకుంటూ, దేవుడు గూడు దగ్గర కూర్చుని వస్తాను..."

"ఆ దేవుడు చెప్పేది కూడా అదే... 
'కర్తవ్యము నీ వంతు -  కాపాడుట నా వంతు' అని !"
       దట్స్ ఆల్ యువర్ హానర్.....
            ******