*ఒక్క అమ్మాయి ఆవేదన..*
*తప్పకుండా చదవండి..!*
*పది పాస్ అయ్యా..ఊహ తెలీని వయస్సు..పదిహేను ఏళ్లకే పెళ్లి..*
*ఇల్లంతా సంబరం,పండగ..ఇంట్లో చుట్టాలు..*
*ఏమి జరుగుతోంది అని తెలుసుకునే లోపే అత్తగారి ఇంట్లో ఉన్న!*
*కొత్త మనుషులు,కొత్త మొహలు..కొత్త పరిచయాలు..*
*చదువే లోకం అనుకున్న నాకు..*
*సరిగ్గా పదేళ్లు..అత్త గారి ఇంటి నుండి బయట అడుగు పెట్టలేదు..*
*News పేపర్ తెలీదు,ఫోన్ తెలీదు..పదిమంది స్నేహితులు తెలీదు!*
*నాలుగు గోడలే నా లోకం..నలుగురు మనుషులే నా ప్రపంచం..*
*నేను ఏంటి అని తెలుసుకునే లోపే ఒక్క బాబు..*
*బాబు కి సేవలు చేసి..*
*ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే..*
*పాతికేళ్లు గడిచిపోయాయి!*
*ఒక్క అమ్మాయి life ఇంతేనా??*
*నాకంటూ ఒక్క మానస్సు ఉంటది కదా! నాకంటూ చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా!*
*నా లైఫ్..గులాబీ పువ్వు లాంటిది..చూడటానికి అందరికి బానే ఉంటది!..కానీ అదే గులాబీ పువ్వుకి చుట్టూ ముళ్ళు కూడా ఉంటాయి!*
*ఒక్కోసారి ఆలోచిస్తే..పెళ్లి అనే బంధాన్ని ముడివేసి..పనిమనిషిగా నన్ను బందించారేమో అనిపిస్తుంది!*
*నేను బాగలేను అని కాదు..బాగున్నాను..కానీ మనస్ఫూర్తిగా లేను..ఏదో చిన్న నలుసు..*
*ఇదేనా లైఫ్ అని..*
*అమ్మాయికి .. అమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఉండే కొంచెం స్వేచ్ఛ కూడా..*
*అత్తగారింటికి రాగానే మొత్తం పోతుంది!*
*ఒక అమ్మాయి ఆవేదన..*
*ఇంట్లో వంట సరిగ్గా అవ్వకపోతే తిట్టే మీరు..తన మనస్సు చదవని మిమ్మల్ని ఇంకెల తిట్టాలి??*
*కానీ తిట్టలేము..తిడితే ఇది తెగించింది అంటారు..*
*ఒక్కోసారి అనిపిస్తుంది..ఆడ పుట్టుక..అన్ని భరించడానికేన??*
*స్వేచ్ఛగా బ్రతకడానికి కదా ఆహ్? అని...*
No comments:
Post a Comment