🙏 *రమణోదయం* 🙏
గురువు అంటే
ఆభరణం కాదు...ఆనందము🙏
*తాను తానుగా (ఆత్మగా) నిత్యమూ ఉంటూనే, ఆ ఆత్మని తనకు అన్యమని ఎంచి సాధనలతో దానిని వెదుకుతాడు. అన్ని వస్తువులలో "నేను" అని ప్రకాశించే జీవులూ తనకు (అజ్ఞానదృష్టికి) అన్యమైన వస్తువు వలె గోచరించినా, చివరకు ఆ "నేను" తనకంటే వేరుకాదు అనే భావన (సుజ్ఞానంలో) అంతమై, ఆ భేదభావం నుండి పూర్తిగా విడిపడటానికే ఆ సాధనలన్నీ.*
కోరిక ఉన్నచోట భగవంతుడు ఉండడు.
మోక్షకాంక్ష కూడా ఓ కోరికే.
ఏ కోరిక కొరకు ఊరక ఉండు.
భగవంతుడు అక్కడే ఉంటాడు!
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.641)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment