Tuesday, 22 April 2025

📒📗📕🙏
పట్టుకుంటే పూర్తయ్యేదాకా వదిలిపెట్టనివ్వవు... పక్కన పిడుగుపడ్డా తెలియనంతగా మరోలోకంలోకి తీసుకుపోతాయి... ఎంత గొప్ప వక్తనైనా మౌనంగా మార్చేస్తాయి... ఏముంటుంది ఈ పుస్తకాల్లో..? (ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం)..

మనిషికి పుస్తకాలు అజ్ఞాత గురువులు. సమస్యల సిడిగుండాల్లో కొట్టుమిట్టాడుతూ, జీవన గమ్యంకోసం తపించే మనుష్యులకు, పుస్తకాలు లైట్ హౌస్ లా, కాంతిపుంజాలు విరజిమ్ముతూ, నేను మీకు తోడున్నాను ప్రియనేస్తమా అని చేతులు జాచి ఆహ్వానించే నేస్తాలు…

పుస్తక పఠనాన్ని దినచర్యలో భాగం చేసుకోమంటూ ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది యునెస్కో.

పుస్తకం మూడక్షరాలే అయినా ఎంతో మంది కలలకు ఆధారం, సామాన్యుని ఆయుధం పుస్తకం. చిరిగిన చొక్కానైనా తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కొమ్మన్నాడు గురజాడ అప్పరావు. ఒక మంచి పుస్తకం వేయిమంది మిత్రులతో సమానమని అన్నారు మరో మహాను భావుడు. అలా ఎందరో మహానుభావులు పుస్తకం విషిష్టతను తెలియజేశారు. అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకున్ని తనలో లీనం చేసుకునేది పుస్తకం. ఒంటరితనంలో తోడుగా ఉండే ఓ మంచి స్నేహితుడు పుస్తకం.

ఉదయాన్నే ఛాయ్ తాగినప్పుడు మొదటి చప్పురింపు ఎంత హాయిని ఇస్తుందో పుస్తకం అంత హాయ్ ని స్తుందని అంటారు కొంత మంది . అలా అన్నింటిని మరిపించి విజ్ఞానాన్ని అందించేది విజ్ఞాన భాంఢాగారం పుస్తకం. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి, ఎంతో మంది జీవితాలు వారి ఎదుర్కొన్న కష్టాలను అక్షర రూపంలో మనకు అందించి, ధైర్యాన్ని ఇస్తుంది పుస్తకం. అంబేడ్కర్ అన్నారు.. నా భార్య బిడ్డలకన్న పుస్తకమే నాకు ఎక్కువ.. నాప్రాణం పుస్తకం అని ఆ కాలంలో పుస్తకాలకి అంత విలువనిచ్చేవారు. కానీ ప్రస్తుత తరం పుస్తకాలను చదవడం మానేసి టీవీలు, వీడియో గేమ్ లు ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటూ కాలం గడుపుతున్నారు. పుస్తకాలను మ్యూజియంలో పెట్టుకొని చూడటం తప్పితే చదవడానికి ఆసక్తి చూపడం లేరు.

పుస్తకం చదివాక దాని గురించి మాట్లాడాలి. అప్పుడే ఆ పుస్తకం ద్వారా ఏం నేర్చుకున్నామన్నది అర్థమవుతుంది. ఒక్కో పుస్తకంలోని అంశాన్నీ పాత్రల్నీ సంఘటనల్నీ ఎన్ని కోణాల్లో చూడవచ్చో తెలుస్తుంది. అందుకు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో బృందాలున్నాయి. వాటిల్లో చేరి చర్చల్లో పాల్గొనవచ్చు...🙏🙏

No comments:

Post a Comment