*సత్ సంతానం:*
సత్ సంతానం కావలసిన భార్యాభర్తలు ఈ పద్ధతిని అవలంబిస్తే మంచి సంతానం గ్యారంటీ. భార్యాభర్తలలో కనీసం ఒకళ్ళైనా మనస్ఫూర్తిగా దీనిని చేస్తే సత్ఫలితాలు తప్పనిసరిగా లభిస్తాయి. *సూర్యుడు ఎర్ర రంగులో ఉన్నప్పుడు స్నానం చేసి, కటి ప్రదేశం కన్నా క్రిందన తడి ఉండాలి బట్టకి. కటి ప్రదేశంలో తడిపిన వస్త్రాన్ని చుట్టబెట్టుకుని అతి శాంతగా ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. ధ్యాన స్థితి అంటే ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఓ ఐదు పది, సెకండ్ల పాటు ఉండాలి . తర్వాత గాయత్రీ మంత్ర జపం చేసుకుంటూ యోని మార్గంగా గర్భంలోకి సూర్యుడి యొక్క కిరణాలు, తేజస్సు ప్రవేశిస్తున్నాయి అవి గర్భధారణకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తున్నాయి అనే భావన చెయ్యాలి. ఇష్టం ఉన్నవాళ్ళు బీజాక్షరాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. బీజాక్షర సహిత మంత్రం ఇలా ఉంటుంది. ఓం భూర్భువఃస్వః యం యం యం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్*
*కుంతీదేవి కర్ణుడిని పొందినటువంటి సాధన ఇదే. అందుచేత కన్యలు ఈ సాధన చెయ్యకూడదు. అయోనిజలు పుట్టవచ్చు.*
ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళకి గర్భం ఇష్టం లేదు, abortion చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. అడిగితే ఇలా చేసుకోమని చెప్పా. విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళు. గర్భం స్థిరపడింది. ఇప్పుడు 12 ఏళ్ళు వాడికి. వాళ్ళమ్మ వాడిని పిడుగు అని పిలుస్తుంది.
*సాధన అనంతరం ఈ అద్భుతమైన సాధనను మనకు అందించిన పరమపూజ్య శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం కోరండి. మీ సాధన తప్పక ఫలిస్తుంది.*
No comments:
Post a Comment